ఆ బ్యూటీ యూనివర్శిటీ టాపర్ అని తెలుసా?
`కేజీఎఫ్` హిట్ తో శ్రీనిధి శెట్టి పాన్ ఇండియాలో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. చాప్టర్ -1 రిలీజ్ తోనే ఐడెంటిటీ దక్కినప్పటికీ అప్పుడు అంతగా ఫోకస్ కాలేకపోయింది
`కేజీఎఫ్` హిట్ తో శ్రీనిధి శెట్టి పాన్ ఇండియాలో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. చాప్టర్ -1 రిలీజ్ తోనే ఐడెంటిటీ దక్కినప్పటికీ అప్పుడు అంతగా ఫోకస్ కాలేకపోయింది. కానీ చాప్టర్ -2 రిలీజ్ తో ఆడియన్స్ కి మరింత రీచ్ అయింది. సినిమాలో అమ్మడి పాత్ర పెద్దగా లేనప్పటికీ హీరోయిన్ అనే ఐడెంటిటీ ఆమెను పాపులర్ చేసింది. `కేజీఎఫ్` ప్రాంచైజీ సక్సెస్ తర్వాత రెండవ ఛాన్స్ రావడానికి నాలుగేళ్లు పట్టింది.
2022లో విక్రమ్ హీరోగా నటించిన `కోబ్రా`లో నటించింది. ఆ తర్వాత మళ్లీ మూడవ సారి ఛాన్స్ రావడానికి రెండేళ్లు పట్టింది. ప్రస్తుతం తెలుగులోనే రెండు సినిమాలు చేస్తోంది. నేచురల్ స్టార్ నాని సరసన హిట్-3, తెలుసు కదా అనే సినిమాలు చేస్తోంది. అలాగే కన్నడలో కిచ్చా సుదీప్ తో 47వ సినిమాలోనూ నటిస్తోంది. మరి ఈ బ్యూటీ యూనివర్శిటీ టాపర్ అని ఎంత మందికి తెలుసు? నటి కంటే ముందు అమ్మడు చదువుల తల్లి అని ప్రూవ్ చేసుకుంది.
అవును ఆ సంగతేంటో? ఆమె మాటల్లోనే, ` అమ్మ చెప్పిందని ఇష్టంగా చదువుకునే దాన్ని. ట్రిపుల్ ఈ ఎంట్రన్స్ మంచి ర్యాక్ సాధించి బెంగుళూరు జైన్ యూనివర్శిటీలో సీటు సంపాదించా. బీటెక్ అక్కడే పూర్తి చేసాను. నేను యూనివర్శిటీ టాపర్ గా నిలిచాను. దీంతో క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చింది. ముంబైలోని యాక్సెంచర్ లో చేరాను. చదువు అనంతరం నేరుగా ముంబైకి వెళ్లాను. నేను ఉద్యోగం చేయాలన్నది అమ్మ కోరిక.
అందుకోసమే అలా చేసాను. కానీ నాకు సంతృప్తి లేదు. సినిమాల్లో నటించాలనే ఆశ కూడా చచ్చిపోలేదు. ఉద్యోగం చేస్తున్నా అవే సినిమా ఆలోచనలతో ఉండేదాన్ని. చివరికి 2015లో ఉద్యోగం మానేసాను. మోడలింగ్ ప్రారంభించిన తర్వాత యాడ్స్ లో అవకాశం వచ్చింది. అప్పట్లో చాలా పాస్ట్ గా మాట్లాడేదాన్ని. దాంతో నా ఉచ్చరణ బాగోలేదు అని హేళన చేసేదాన్ని. క్రమంగా విమర్శలు, పొగడ్తలను బ్యాలెన్స్ చేయడం తెలుసుకున్నా. కొన్ని ప్రకటనల తర్వాత పేపర్లో నాఫోటో చూసి ప్రశాంత్ నీల్ ఫోన్ చేసారు` అని అన్నారు.