K.G.F బ్యూటీ డబుల్ ధమాకా..!
ఐతే అమ్మడికి మంచి ఆఫర్లు వచ్చినా ఆ టైం కు ఎందుకో నో చెప్పేసింది. ప్రస్తుతం అమ్మడు తెలుగులో రెండు క్రేజీ సినిమాలతో వస్తుంది.;

ఎంట్రీ ఇవ్వడమే ఒక పాన్ ఇండియా సూపర్ హిట్ సినిమాతో హీఓరోయిన్ గా పరిచయమైతే ఆ హీరోయిన్ కెరీర్ బ్లాస్టింగ్ గా ఉంటుందని అనుకుంటాం కానీ ఒక బహమ పరిస్థితి అలా లేదు. కథల విషయంలో అతి జాగ్రత్త వల్లనో ఏమో కానీ ఆఫర్లు పెద్దగా రావట్లేదు. కె.జి.ఎఫ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఆ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఆ తర్వాత అమ్మడు కోబ్రా సినిమా చేసింది. ఆ సినిమా ఎన్నో అంచనాలతో వచ్చినా వర్క్ అవుట్ కాలేదు.
ఐతే అమ్మడికి మంచి ఆఫర్లు వచ్చినా ఆ టైం కు ఎందుకో నో చెప్పేసింది. ప్రస్తుతం అమ్మడు తెలుగులో రెండు క్రేజీ సినిమాలతో వస్తుంది. అందులో ఒకటి న్యాచురల్ స్టార్ నానితో హిట్ 3 ఒకటి కాగా.. మరొకటి సిద్ధు జొన్నలగడ్డతో నటిస్తున్న తెలుసు కదా. ఈ రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది శ్రీనిధి శెట్టి.
తన క్యూట్ లుక్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు కెరీర్ ప్లానింగ్ ఏంటన్నది ఎవరికీ తెలియట్లేదు. కె.జి.ఎఫ్ తర్వాత తెలుగు నుంచి క్రేజీ ఆఫర్లు వస్తే వాటిని కాదని అమ్మడు తనకు నచ్చిన కథలను ఓకే చేసింది. కె.జి.ఎఫ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది అన్న మాటే కానీ అందులో ఆమెకు పెద్దగా స్కోప్ ఇవ్వలేదు. ఆ ఇంపాక్ట్ వల్లనో ఏమో కానీ ఇక మీదట పాత్ర ప్రాధాన్యత ఉన్న సినిమాలనే చేయాలని అనుకుంటుంది అమ్మడు.
హిట్ 3, తెలుసు కదా సినిమాలతో శ్రీనిధి శెట్టి డబుల్ ధమాకా చేయనుంది. ఈ రెండు సినిమాల్లో నాని హిట్ 3 ఊర మాస్ సినిమాగా వస్తుంది. ఈ సినిమాలో శ్రీనిధి క్యూట్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక సిద్ధు తెలుసు కదా సినిమాలో శ్రీనిధితో పాటు రాశి ఖన్నా కూడా ఒక హీరోయిన్ గా నటిస్తుంది. సో ఈ రెండు సినిమాల ఫలితాలను బట్టి శ్రీనిధి తెలుగు కెరీర్ ఆధారపడి ఉంటుంది. తప్పకుండా అమ్మడికి తెలుగు ఆడియన్స్ కనెక్ట్ ఐతే మాత్రం తనకు ఇక్కడ స్టార్ కిరీటం ఇచ్చేస్తారని చెప్పొచ్చు. టాలీవుడ్ లో హీరోయిన్స్ కి అవకాశాలు ఎలా ఉన్నాయో కాస్త నెగిటివిటీ వస్తే దూరం చేయడం కూడా అదే రేంజ్ లో ఉంటుంది. వరుస సక్సెస్ లు ఇస్తుంటే కచ్చితంగా ఆ హీరోయిన్ కి వరుస అవకాశాలు వస్తుంటాయి.