.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

ఇంత గ్యాప్ తో ఈ దూకుడేంది అమ్మ‌డు?

అయితే తాజాగా అమ్మ‌డికి కేజీఎఫ్ రిలీజ్ అయిన రెండేళ్ల త‌ర్వాత అవ‌కాశాలు పుంజుకోవ‌డం ఇంట్రెస్టింగ్.

Update: 2024-06-30 09:44 GMT

'కేజీఎఫ్' హిట్ తో క‌న్న‌డ బ్యూటీ నిధి శెట్టి పాన్ ఇండియాలో ఫేమ‌స్ అయిన సంగ‌తి తెలిసిందే. రెండు భాగాలు భారీ విజ‌యం సాధించ‌డంతో నిధి కెరీర్కి తిరుగుండ‌ద‌నుకున్నారంతా. అన్ని భాష‌ల్లోనూ అవ‌కాశాలు త‌ధ్య‌మ‌న్నారు. కానీ అమ్మ‌డి కెరీర్ అలా సాగ‌లేదు. పాన్ ఇండియా స‌క్సెస్ ఉన్నా? పేరుకే త‌ప్ప అవ‌కాశాల ప‌రంగా వెనుక‌బ‌డే ఉంది. అయితే తాజాగా అమ్మ‌డికి కేజీఎఫ్ రిలీజ్ అయిన రెండేళ్ల త‌ర్వాత అవ‌కాశాలు పుంజుకోవ‌డం ఇంట్రెస్టింగ్. అవును ఇప్పుడు నిధికి వ‌రుస‌గా తెలుగులో చాన్సులు అందుకుంటుంది.

ఇప్ప‌టికే 'తెలుసు క‌దా' అనే ఓ సినిమా చేస్తుంది. ఇది సెట్స్ లో ఉంది. ఇంత‌లోనే టాలీవుడ్ హంక్ రానా హీరోగా న‌టించ‌నున్న కొత్త సినిమాలోనూ ఈ భామనే హీరోయిన్ గా తీసుకున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. ప్ర‌స్తుతం రానా హీరోగా కిషోర్ అనే కొత్త కుర్రాడు ద‌ర్శక‌త్వంలో ఆర్కా మీడియా వ‌ర్క్స్ ఓ సినిమా నిర్మించేందుకు రెడీ అయింది. టాలీవుడ్ లో కొంద‌రు పేరున్న భామ‌ల్ని ప‌రిశీలించిన‌ప్ప‌టికీ వాళ్ల క‌న్నా నిధి అయితే ఆ పాత్ర‌కు ప‌ర్పెక్ట్ గా సూటువుతంద‌ని ద‌ర్శ‌కుడు భావించ‌డంతో ఆమె ఎంట్రీ షురూ అయింది.

Read more!

ఇటీవ‌లే ఆమెతో చ‌ర్చ‌లు కూడా ముగించిన‌ట్లు చిత్ర వ‌ర్గాల నుంచి తెలుస్తోంది. నిధి అగ‌ర్వాల్ కంబ్యాక్ కి ఇది మంచి అవ‌కాశం అని చెప్పాలి. స‌క్సెస్ అయితే టాలీవుడ్ నెత్తిన పెట్టుకుంది. క‌న్న‌డ ప‌రిశ్ర‌మ స‌క్సెస్ ఉన్నా? ప్రోత్స‌హించ‌లేదు. కానీ టాలీవుడ్ లో ప‌రిచ‌యాలు పెంచుకుంటే స‌క్సెస్ తో ప‌నిలేకుండా అవ‌కాశాలు ద‌క్కుతాయి. అయితే న‌టిగా మ‌డి క‌ట్టుకుని కూర్చుంటే మాత్రం ఛాన్సులు కష్టం.

నిధి శెట్టి ఇంత‌వ‌ర‌కూ ఏ సినిమాలోనూ గ్లామ‌ర్ షో చేసింది లేదు. రొమాంటిక్ స‌న్నివేశాల‌కు, లిప్ లాక్ ల‌కు దూరంగా ఉంది. ఓ గిరి గీసుకుని అందులోనే ప‌నిచేసింది. కానీ టాలీవుడ్ లో అలాంటి గీత‌లుంటే? క‌ష్టం. అన్ని ర‌కాల పాత్ర‌ల‌కు, ఇంటిమేట్ స‌న్నివేశాల‌కు సైతం సిద్దంగా ఉంటేనే అనుకున్న అవ‌కాశాలు వ‌స్తాయి. మ‌రి టాలీవుడ్ ఎంట్రీకి ముందు ఇవ‌న్నీ ఆలోచించిందా? లేదా? అన్న‌ది కాల‌క్ర‌మంలో తెలుస్తుంది.

Tags:    

Similar News