రాజమౌళి వల్లే చనిపోతున్నా: స్నేహితుడి సంచలన ఆరోపణలు!

Update: 2025-02-27 09:37 GMT

తెలుగు సినిమా గర్వించే దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ఇప్పుడు ఊహించని వివాదంలో ఆయన పేరు వినిపిస్తుంది. ప్రముఖ నిర్మాత, అతని సుదీర్ఘ స్నేహితుడు ఉప్పలపాటి శ్రీనివాసరావు చేసిన ఆరోపణలు సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. శ్రీనివాసరావు తన జీవితాన్ని రాజమౌళి నాశనం చేశాడని ఆరోపిస్తూ, ఒక సెల్ఫీ వీడియో, లేఖను బయటపెట్టారు. ఈ లేఖలో ఊహించిన ఆరోపణలు ఉన్నాయి.

శ్రీనివాసరావు వివరణ ప్రకారం, రాజమౌళి తాను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేసిన యమదొంగ సినిమా తర్వాత తనను దూరం పెట్టాడని చెప్పారు. 34 ఏళ్ల స్నేహం ఉన్నప్పటికీ, తన వ్యక్తిగత జీవితంలో ఒక మహిళ ప్రవేశించడంతో రాజమౌళి తనను పూర్తిగా విస్మరించాడని ఆరోపించారు. ఇకపై తాను బతకలేనని, తన మరణానికి రాజమౌళే కారణమని తన లేఖలో రాశారు.

శ్రీనివాసరావు వీడియోలో ఈ విధంగా మాట్లాడారు. "రాజమౌళి దర్శకుడు అవ్వక ముందు నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. అతను కూడా ఆ అమ్మాయిని లవ్ చేశాడు. ఇక నన్ను త్యాగం చేయమని అన్నాడు. అప్పుడు కెరీర్ గురించి ఆలోచించి నేను త్యాగం చేశాను. అయితే కొన్నాళ్ల తరువాత రాజమౌళి గత జీవితానికి సంబంధించిన ఈ విషయాలను బయటకు చెబుతానేమో అని నన్ను టార్చర్ చేయడం స్టార్ట్ చేశారు. మా స్నేహం గురించి ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు. రాజమౌళి కారణంగా నా కెరీర్ నాశనం అయ్యింది. అతని వల్లే 50 ఏళ్లయినా ఇంకా బ్యాచిలర్ గానే ఉన్నాను.. అంటూ శ్రీనివాసరావు వివరణ ఇచ్చారు.



అంతేకాదు, రాజమౌళి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎదగడానికే ఇతర దర్శకులపై క్షుద్రపూజలు చేయించాడని, తనను కూడా సినిమాల నుంచి తొలగించేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు. పోలీసులు సుమోటో కేసు నమోదు చేయాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అదనంగా, ఈ వ్యవహారంలో నిజానిజాలు వెలుగులోకి రావాలంటే రాజమౌళికి లై డిటెక్టర్ టెస్ట్ చేయాలని ఆయన కోరారు. ఈ వివాదంపై రాజమౌళి నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు. ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ29 షూటింగ్‌లో బిజీగా ఉన్న రాజమౌళి, ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం ఊహించని పరిణామంగా మారింది. ఈ ఆరోపణల వెనుక నిజమెంత? ఇది వ్యక్తిగత విషయమేనా లేక మరేదైనా కారణం ఉందా అన్నదానిపై చర్చ జరుగుతోంది.

అంతే కాకుండా శ్రీనివాసరావు ఇది నా మరణ వాగ్మూలం అంటూ వీడియో రిలీజ్ చేసిన అనంతరం అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను ఎక్కడ ఉన్నాడు అనేది కూడా తెలియకుండా ఉంది. మరి ఈ విషయంలో పోలీసులు ఏ విధంగా విచారణ కొనసాగిస్తారో చూడాలి.


Full View
Tags:    

Similar News