అవసరాల ఎక్కడా కనిపించడం లేదే!
నటుడిగా అవసరాల శ్రీనివాస్ వేగం తగ్గింది. ఏడాదికి మూడు ..నాలుగు సినిమాలతో మెప్పించే అవసరాల ఇప్పుడు నటుడిగా పెద్దగా కనిపించడం లేదు
నటుడిగా అవసరాల శ్రీనివాస్ వేగం తగ్గింది. ఏడాదికి మూడు ..నాలుగు సినిమాలతో మెప్పించే అవసరాల ఇప్పుడు నటుడిగా పెద్దగా కనిపించడం లేదు. అయితే దర్శకుడిగా నిలదొక్కుకోవాలని మధ్యలో కొన్ని సినిమాలు చేసాడు. కానీ అవేవి దర్శకుడిగా అవసరాలని బిజీగా మార్చలేదు. ఆమధ్య నాగశౌర్య హీరోగా 'ఫలానా అబ్బాయి..ఫలానా అమ్మాయి' అనే సినిమా తెరకెక్కించాడు.
కానీ ఈ సినిమా కూడా నిరాశనే మిగిల్చింది. ఆ రకంగా అవసరాల ఖాతాలో మరో ప్లాప్ సినిమా తప్పలేదు. అంతకు ముందు 'అవతార్ -2' తెలుగు డబ్బింగ్ రైటర్ గా పనిచేసాడు. అలాగే బాలీవుడ్ సినిమా 'బ్రహ్మస్త్ర'కి తెలుగు వెర్షన్ డైలాగులు రాసారు. ఇలా అవసరాల కెరీర్ గత రెండేళ్లగా సాగింది. నటుడిగా మాత్రం గతేడాది రిలీజ్ అయిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమాలు నటించాడు. అది రిలీజ్ అయి ఏడాది పూర్తయింది
అప్పటి నుంచి అవసరాల నుంచి నటుడిగా సినిమా చేస్తున్నట్లు ఎలాంటి అప్ డేట్ లేదు. మరి ఇప్పుడు అవసరాల ఏం చేస్తున్నట్లు? నటుడిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడా? దర్శకుడిగా ఛాన్సులు కోసం ట్రై చేస్తున్నాడా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే అవసరాల ఆసక్తి దర్శకుడిగా బిజీ అవ్వాలనే తపనతోనే ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది.
తెలుగు సినిమా పాన్ ఇండియాలో క్రేజ్ దక్కించుకోవడంతో తెలుగు సినిమా మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని క్రియేటివ్ గా ఎదిగితే పేరుతో పాటు డబ్బు సంపాదన కూడా బాగుంటుందనే ఐడియాతో ఆ రకంగా బిజీ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్లు వినిపిస్తుంది. గతేడాది నుంచి అవసరాల వివిధ సినిమా లకు రచయితగానే పనిచేసాడని అంటున్నారు. అయితే వాటిలో తన పేరు వేసుకోకుండా కేవలం పారితోషి కంతో సరిపెట్టుకున్నారుట. నటుడిగా తనకు ఉండాల్సిన గుర్తింపు ఎలా ఉంది. కొత్తగా రచయిత పేరు వేయించుకోవడంపై అనాసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది.