శ్రీవల్లి 2.0.. పుష్పకు మించి..
పుష్ప 2లో శ్రీవల్లి 2.0 చూస్తారని చెప్పిన రష్మిక.. అందరి దృష్టి తన పాత్ర వైపు తిప్పుకుంది. సీక్వెల్‌లో తన రోల్ మరింత బలంగా ఉంటుందని చెప్పింది.
అటు బాలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. ఇటీవల యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ బ్యూటీ.. త్వరలో పుష్ప-2తో సందడి చేయనుంది. శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ లో కొన్ని నెలలుగా పాల్గొంటోంది రష్మిక. మరోసారి శ్రీవల్లిగా పాన్ ఇండియా లెవెల్ లో అలరించనుంది. ఇటీవల తన పాత్ర కోసం చెప్పి సినిమాపై మరింత ఆసక్తి పెంచింది.
పుష్ప 2లో శ్రీవల్లి 2.0 చూస్తారని చెప్పిన రష్మిక.. అందరి దృష్టి తన పాత్ర వైపు తిప్పుకుంది. సీక్వెల్‌లో తన రోల్ మరింత బలంగా ఉంటుందని చెప్పింది. పుష్ప-1 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పార్ట్-2 పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయని తెలిపింది. దీంతో తమ పాత్రలపై బాధ్యత పెరిగిందని చెప్పింది. పార్ట్-1 కంటే కూడా ఈ సినిమాకు ఎక్కువ కష్టపడ్డానని చెప్పింది. దీంతో ఆమె పాత్రపై నెటిజన్లు తెగ మాట్లాడుకుంటున్నారు.
పుష్ప-2లో రష్మిక రోల్ మరింత డైనమిక్ గా ఉండనుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. శ్రీవల్లి రోల్ ను ఈ సారి సుకుమార్ గ్రాండ్ గా క్రియేట్ చేశారని అంటున్నారు. పార్ట్ 2లో కూడా రష్మిక పాత్ర ఎక్కువ సేపు ఉంటుందని, పార్ట్ 1 కంటే ఇంకా బాగుంటుందని చెబుతున్నారు. గంధపు చెక్కల స్మగ్లర్ భార్యగా వ్యాపారానికి సంబంధించి చాలా విషయాల్లో శ్రీవల్లి ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని తెలుస్తోంది.
సినిమాలో శ్రీవల్లి రోల్ కు గ్రే షేడ్ (విభిన్నమైన) కూడా సుకుమార్ యాడ్ చేశారట. కాస్త దూకుడుగా రష్మిక సినిమాలో కనిపిస్తుందని తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్ చివర్లో పుష్పరాజ్, శ్రీవల్లికి పెళ్లి అయిన వివాహం తెలిసిందే. అక్కడి నుంచి సీక్వెల్ కంటిన్యూ అవ్వనుందట. ఈ మూవీ కోసం 90 రోజులకు పైగా రష్మిక డేట్స్ ఇచ్చినట్లు సమాచారం. ఆ మధ్య ఓ గుడిలో షూటింగ్ జరుగుతుందని కూడా అప్డేట్ ఇచ్చింది రష్మిక .
అయితే స్మగ్లింగ్ సిండికేట్ కు నాయకుడిగా మారిన తర్వాత పుష్పరాజ్ ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? భన్వర్ సింగ్ షెకావత్, దాక్షాయణి, మంగళం శీను నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? వంటి అంశాలతో పుష్ప సీక్వెల్ తెరకెక్కుతోంది. నటీనటులు ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్టు 15వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.