ఓజీ : పవన్‌తో వర్క్‌పై ఆమె స్పందన
హీరోయిన్‌గా ఒకప్పుడు ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ శ్రీయా రెడ్డి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుస సినిమాలు చేస్తుంది.
హీరోయిన్‌గా ఒకప్పుడు ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ శ్రీయా రెడ్డి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుస సినిమాలు చేస్తుంది. ముఖ్యంగా ఈమె సలార్‌లో పోషించిన రాధా రమ మన్నార్ పాత్రకు మంచి మార్కులు దక్కాయి. కనిపించింది కొద్ది సమయం అయినా నటనతో మెప్పించింది. పార్ట్ 2లో మరింతగా ఈమె పాత్ర పరిధి ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఈమెకు వరుసగా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు వస్తున్నాయట. కానీ ఆచితూచి మాత్రమే ఈమె పాత్రల ఎంపిక చేసుకుంటుంది. ప్రస్తుతం ఈమె పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది.
సాహో సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా రూపొందుతున్న సినిమాలో శ్రియా రెడ్డి కీలక పాత్రలో కనిపించబోతుంది. ఆమె పాత్రపై అంచనాలు ఇప్పటికే పెరిగాయి. ఆ మధ్య ఈమె మాట్లాడుతూ సినిమాలోని తన పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది. తాజాగా మరో ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఓజీ సినిమాపై అంచనాలు పెంచింది. ఓజీ సినిమాలోని తన పాత్ర సలార్ సినిమాలోని రాధా రమ మన్నార్ ని మించి ఉంటుంది అంటూ ఫ్యాన్స్‌కి హామీ ఇచ్చింది.
ఆ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి శ్రీయా రెడ్డి మాట్లాడుతూ... హీరో పవన్ కళ్యాణ్ గారితో పని చేయడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఆయనతో కలిసి ఇప్పటికే కొన్ని సన్నివేశాల చిత్రీకరణ చేశాం. ముందు ముందు మరిన్ని సీన్స్ ఆయనతో కలిసి చేయాల్సి ఉంది. ఆయన చాలా తెలివైన వాడు. ఇతరుల పట్ల చాలా మర్యాదగా నడుచుకుంటారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఆయన గౌరవించే విధానం నాకు నచ్చింది. అలాంటి ఒక పర్సనాలిటీ నేను చూడలేదు. ఆయన తీరు చాలా విభిన్నంగా ఉంది. ఆయన ప్రతి చర్యలోనూ హుందాతనం కనిపించింది అని శ్రీయా రెడ్డి అన్నారు.
ఓజీ సినిమాను ప్రారంభించి చాలా కాలం అయ్యింది. ఇప్పటికే సినిమా విడుదల కావాల్సి ఉన్నా పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండటం.. ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఓజీ సినిమాకు డేట్లు ఇవ్వలేక పోయాడు. ఇప్పుడిప్పుడే సినిమా కోసం డేట్లు ఇస్తున్నాడు. ఒక వైపు హరి హర వీరమల్లు సినిమాతో పాటు మరో వైపు ఓజీ సినిమాను ఆయన చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ను ముగిస్తామని దర్శకుడు సుజీత్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. త్వరలోనే సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇస్తామని నిర్మాతలు ప్రకటించారు. 2025 సమ్మర్‌లో సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి.