ప్రభాస్ స్వీట్...ఆయన మాత్రం కామ్!
అయితే తొలిసారి డార్లింగ్ ప్రభాస్...మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తో పనిచేయడం మాత్రం గ్రేట్ ఎక్స్ పీరియన్స్ గా చెప్పుకొచ్చారు.
టాలీవుడ్ ల్ మళ్లీ శ్రియా రెడ్డి పేరు మారిమ్రోగిపోతున్న సంగతి తెలిసిందే. 'సలార్' సినిమాలో అమ్మడి పాత్రకి మంచి గుర్తింపు దక్కింది. శ్రియా రెడ్డి ట్యాలెంట్ కి తగ్గ రోల్ పడితే పెర్పార్మెన్స్ ఇవ్వడంలో ఆమెకే ఆమె సాటి అని ఎన్నో సినిమాల్లో నిరూపించింది. చేసింది కొన్ని సినిమాలే అయినా నటనతో తనదైన మార్క్ తప్పనిసరిగా పడుతుంది. 'సలార్' లో వరదరాజు సోదరి రాధా రమ పాత్రలో మరోసారి అలరించింది.
ఆమె లుక్ ..నటనకు మంచి మార్పులు పడ్డాయి. శ్రియా రెడ్డి పాత్రని ఏకంగా 'బాహుబలి'లో శివగామి రమ్యకృష్ణ పాత్రతోనే పోల్చుతున్నారు. దీంతో శ్రియా రెడ్డి పేరు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇక సలార్ చిత్రీకరణలో భాగంగా శ్రియారెడ్డి ఎంతో మంది నటీనటులతో కలిసి నటించారు. అయితే తొలిసారి డార్లింగ్ ప్రభాస్...మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తో పనిచేయడం మాత్రం గ్రేట్ ఎక్స్ పీరియన్స్ గా చెప్పుకొచ్చారు.
ఆ స్టార్ హీరోలిద్దరు గురించి ఆమె మనసులో అభిప్రాయాలు ఎంతో ఓపెన్ గా షేర్ చేసుకున్నారు. 'ప్రభాస్ చాలా స్వీట్ పర్సన్. ఎప్పుడూ కూల్ గా ఉంటారు. ఎలాంటి హడావుడి కనిపించదు. చాలా సింపుల్ గా వస్తారు. వెళ్తారు. సెట్స్ లో కంగారు పడటం..ఎదుట వారికి కంగారు పెట్టేయడం లాంటివి ఉండవు. కెమెరా ముందుకు ఎంత కూల్ గా వస్తారో? సీన్ అయిన తర్వాత అంతే కూల్ గా వెళ్లి కూర్చుంటారు. అంత కూల్ గా ఉండే పర్సన్ ని నేను ఇంతవరకూ చూడలేదు.
పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఆయనలా ఉంటారు. ఇద్దరికి కొన్ని విషయాల్లో చాలా దగ్గర పోలికలు ఉంటాయనిపిస్తుంది. ప్రభాస్ లాగే పృథ్వీ కూడా ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడరు. ఆయన కామ్ ' అనేసారు. మొత్తానికి శ్రియారెడ్డి సలార్ సినిమా ద్వారా హీరోల విషయాలు కూడా పసిగట్టేసారు. ఇక సలార్ -2 లో తన పాత్ర నివిడి ఎక్కువగా ఉంటుందని తెలిపారు. రెండవ భాగం మొదటి భాగానికి రెండింతలు యాక్షన్ ఉంటుందన్నారు.