తమన్.. ఈ టెన్షన్ ఎలా తట్టుకుంటున్నాడో..

ఆ సమయంలో వేదికపై మాట్లాడుతూ తడబడ్డారు. గాయ‌నీగాయ‌కుల‌ను వేదిక‌పై పిలుస్తూ వారి పేర్లు ప‌ల‌క‌డంలో కాస్త ఇబ్బంది ప‌డ్డారు.

Update: 2025-01-06 12:30 GMT

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. కెరీర్ లో ఇప్పుడు హైయెస్ట్ స్టేజ్ లో ఉన్న విషయం తెలిసిందే. వరుస ప్రాజెక్టుల్లో భాగమవుతూ బిజీబిజీగా గడుపుతున్నారు. స్టార్ హీరోల సినిమాలకు ఎక్కువగా ఆయనే సంగీత దర్శకుడిగా వర్క్ చేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఇప్పుడు సంక్రాంతి చిత్రాల్లో రెండింటికీ ఆయనే మ్యూజిక్ డైరెక్టర్.

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మహరాజ్ చిత్రాలకు తమన్ బాణీలు కడుతున్న విషయం తెలిసిందే. ఆ రెండు చిత్రాలు రెండు రోజుల గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. జనవరి 10వ తేదీన గేమ్ ఛేంజర్ విడుదల అవ్వనుండగా.. 12వ తేదీ డాకు మహారాజ్ మూవీ థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది.

అయితే రీసెంట్ గా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జరగ్గా.. తమన్ హాజరయ్యారు. ఆ సమయంలో వేదికపై మాట్లాడుతూ తడబడ్డారు. గాయ‌నీగాయ‌కుల‌ను వేదిక‌పై పిలుస్తూ వారి పేర్లు ప‌ల‌క‌డంలో కాస్త ఇబ్బంది ప‌డ్డారు. తాను 15 రోజులుగా నిద్రపోలేదని తమన్ తెలిపారు. అదే తన తడబాటుకు కారణంగా పరోక్షంగా చెప్పారు.

అది నిజమేనని తెలుస్తోంది. ఎందుకంటే.. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ రిలీజ్ కు ఇంకా చాలా తక్కువ సమయం ఉంది. కానీ రెండు సినిమాలకు చెందిన తమన్ వర్క్ పూర్తి కాలేదని తెలుస్తోంది. డే అండ్ నైట్ ఆయన పని చేస్తున్నట్లు సమాచారం. తన వర్క్ ను పూర్తి చేసేందుకు కష్టపడుతున్నట్లు వినికిడి. ఇప్పుడు ఈ విషయంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీంతో తమన్ ఆ టెన్షన్ ఎలా తట్టుకుంటున్నాడోనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే రెండు సినిమాల సాంగ్స్ ఇప్పటికే రిలీజ్ అవ్వగా.. ప్రస్తుతం తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ ను పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏ సినిమాకు అయినా బీజీఎం చాలా ముఖ్యం. మూవీ హిట్ అవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

దానికి తోడు రెండు సినిమాలూ స్టార్ హీరోలవే. ఇప్పటికే ఆడియన్స్ లో వాటిపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తమ అభిమాన నటుల చిత్రాలు ఎంజాయ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో తమన్ నుంచి బెస్ట్ అవుట్ పుట్ ఆశిస్తారు. కాబట్టి తమన్ కు ఇద్ది పెద్ద టెన్షనే. మరి రెండు మూవీస్ తో ఆయన ఎలాంటి హిట్స్ అందుకుంటారో చూడాలి.

Tags:    

Similar News