ఆ మలయాళం సినిమాను కొనేసిన రాజమౌళి కొడుకు

ఈ క్రమంలోనే ప్రేమలు మూవీ తెలుగు రైట్స్ ని దర్శక ధీరుడు ఎస్. ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయ కొనుగోలు చేసి విడుదల చేస్తున్నాడు.

Update: 2024-02-26 12:26 GMT

సినిమా ఇండస్ట్రీకి ఒకప్పుడు పరిమితులు ఉండేవి కానీ ఇప్పుడు అలా కాదు. ముఖ్యంగా చెప్పాలంటే సినిమాలకు లాంగ్వేజ్ బ్యారియర్స్ తొలగిపోయాయి. ఆడియన్స్ మైండ్ సెట్ కూడా మారిపోయింది. పాన్ ఇండియా ట్రెండ్ వచ్చాక భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఈమధ్య ఇతర భాషల్లో సక్సెస్ అయిన సినిమాలను డబ్ చేసి రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. మన తెలుగులో ఇది బాగా వర్కవుట్ అవుతోంది.

 

ముఖ్యంగా తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో సక్సెస్ అయిన సినిమాలను అగ్ర నిర్మాతలు డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అలాంటి నిర్మాతల్లో అల్లు అరవింద్, దిల్ రాజు లాంటి వాళ్ళు ముందుంటారు. ఇక ఈమధ్య మలయాళంలో వచ్చిన 'ప్రేమలు' అనే చిన్న సినిమా ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ అందుకుని బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ రాబట్టింది.

ఈ మూవీ హైదరాబాద్ మల్టీప్లెక్స్ స్క్రీన్స్ లో బాగా ఆడుతోంది. హైదరాబాద్లో ఉన్న మలయాళ ఆడియన్స్ మాత్రమే కాదు తెలుగు ఆడియోన్స్ సైతం ఈ సినిమా అని చూసేందుకు థియేటర్స్ కి వెళ్తున్నారు. అందుకు కారణం పేరుకే మలయాళ సినిమా అయిన 'ప్రేమలు'.. హైదరాబాద్ నేపథ్యంలో తెరకెక్కింది. దానికి తోడు ఇది ఒక లవ్ స్టోరీ. సో తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయడానికి ఇంతకంటే రీజన్స్ అవసరం లేదు.

ఈ క్రమంలోనే ప్రేమలు మూవీ తెలుగు రైట్స్ ని దర్శక ధీరుడు ఎస్. ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయ కొనుగోలు చేసి విడుదల చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి తెలుగు డబ్బింగ్ పనులు మొదలైనట్లు తెలిసింది. గతంలో కార్తికేయ సహ నిర్మాతగా కొన్ని సినిమాల్లో పెట్టుబడులు పెట్టాడు. కానీ ఆ సినిమాలు ఇతనికి నష్టాలు తెచ్చిపెట్టాయి. దాంతో మళ్లీ అటువైపుకు వెళ్లలేదు. కార్తికేయ సహనిర్మాతగా వ్యవహరించిన సినిమాల్లో నాగచైతన్య 'యుద్ధం శరణం' కూడా ఒకటి.

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అసలు ఇలాంటి ఓ సినిమా చైతూ చేశాడనే విషయం ఇప్పటికీ చాలామందికి తెలీదు. అలాంటి సినిమాకి పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయిన కార్తికేయ మళ్లీ లాంగ్ గ్యాప్ తర్వాత ఈ ప్రేమలు అనే మలయాళ సినిమాని తెలుగులో విడుదల చేస్తున్నాడు. మార్చి 8 శివరాత్రి కానుకగా ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

Tags:    

Similar News