మ‌ళ్లీ షూటింగ్ కు సిద్ధ‌మ‌వుతున్న మ‌హేష్

ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే.;

Update: 2025-04-15 06:56 GMT
Rajamouli and Mahesh Babu Resumes Next Schedule Begins Soon!

ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఎస్ఎస్ఎంబీ29 టైటిల్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా కోసం దేశం మొత్తం ఎదురుచూస్తుంది. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్టుపై అంచ‌నాలు తారా స్థాయిలో ఉండ‌గా, ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నాలు సృష్టించేలా రాజ‌మౌళి దీన్ని తెర‌కెక్కిస్తున్నారు.

క‌నీసం సినిమాను అనౌన్స్ కూడా చేయ‌కుండానే ఎస్ఎస్ఎంబీ29ను మొద‌లుపెట్టి సెట్స్ పైకి తీసుకెళ్లి ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ ను కూడా పూర్తి చేశారు రాజ‌మౌళి. రెండు షెడ్యూల్స్ షూటింగ్ అయిపోయాక షూటింగ్ కు కాస్త గ్యాప్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఈ గ్యాప్ లో ప్రియాంక చోప్రా మ‌ళ్లీ యూఎస్ వెళ్ల‌గా రాజ‌మౌళి త‌న డాక్యుమెంట‌రీ ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ ప్ర‌మోష‌న్స్ కోసం జ‌పాన్ వెళ్లారు.

ఇక హీరో మ‌హేష్ బాబు త‌న ఫ్యామిలీతో క‌లిసి వెకేష‌న్ కోసం రోమ్ కు వెళ్లారు. వెకేష‌న్ కు వెళ్తూ ఎయిర్‌పోర్టులో మ‌హేష్ త‌న పాస్‌పోర్ట్‌ను అక్క‌డున్న‌ ఫోటోగ్రాఫ‌ర్ల‌కు చూపించిన వీడియో నెటిజ‌న్ల‌ను ఆక్ట‌టుకోవ‌డంతో పాటూ నెట్టింట వైర‌ల్ కూడా అయింది. అయితే ఇప్పుడు మ‌హేష్ త‌న వెకేష‌న్ ను ముగించేసుకుని తిరిగి హైద‌రాబాద్ చేరుకున్నారు.

హైద‌రాబాద్ కు వ‌చ్చిన మ‌హేష్ ఇప్పుడు మ‌ళ్లీ రాజ‌మౌళి తో క‌లిసి సెట్స్ లో జాయిన్ అవ‌డానికి రెడీగా ఉన్నారు. త్వ‌ర‌లోనే ఎస్ఎస్ఎంబీ29కు సంబంధించిన నెక్ట్స్ షెడ్యూల్ మొద‌ల‌య్యే అవ‌కాశాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాకు విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ‌ను అందించ‌గా, ఫారెస్ట్ అడ్వెంచ‌ర్ గా ఎస్ఎస్ఎంబీ29 రూపొందుతుంది.

ప్రియాంక చోప్రా కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ సినిమాలో పృథ్వీ రాజ్ సుకుమారన్ కూడా న‌టిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎం.ఎం కీర‌వాణి సంగీతం అందిస్తున్న ఎస్ఎస్ఎంబీ29ను దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్ లో కె.ఎల్ నారాయ‌ణ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాను అనౌన్స్ చేస్తూ రాజ‌మౌళి ప్రెస్ మీట్ నిర్వ‌హిస్తార‌ని ఫిల్మ్ న‌గ‌ర్ లో వార్త‌లు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News