SSMB29: ఒడిశాలోని ఆ జిల్లానే ఎందుకు?
సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న SSMB29పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.;
సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న SSMB29పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ సిమిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే రాజమౌళి గత సినిమాలను పరిశీలిస్తే, ఆయన ఎక్కువగా స్టూడియో సెట్స్‌లోనే షూటింగ్ చేశారు. బాహుబలి పూర్తిగా రామోజీ ఫిల్మ్ సిటీలో చేయగా ఆ తరువాత RRR కోసం ఒకటి రెండు ఎపిసోడ్స్ కోసం విదేశాలకు వెళ్ళాల్సి వచ్చింది.
కానీ ఈసారి మాత్రం రాజమౌళి రూట్ మార్చారు. సినిమా ప్రారంభమైనప్పటి నుంచి నిజజీవిత లొకేషన్లలో షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఈ క్రమంలోనే మొదటి అవుట్‌డోర్ షెడ్యూల్‌ను ఒడిశాలో ప్లాన్ చేశారు. అయితే ఒడిశాలోని కొరపూట్ జిల్లాను ఎందుకు ఎంపిక చేసుకున్నారు అనేది అసలు సందేహం. ఇండియన్ సినిమా స్థాయిని అంతర్జాతీయంగా మలచిన రాజమౌళి, ఈసారి మరింత యథార్థతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.
SSMB29 ఒక గ్లోబ్ ట్రోటింగ్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందుతుండటంతో, ఈ కథకు మేటి లొకేషన్లు అవసరం. అందుకే ఒడిశాలోని కొరాపుట్ జిల్లా, ముఖ్యంగా దేవ్మాలి, తలమాలి, కల్యామాలి వంటి ప్రాంతాలను ఎంపిక చేసుకున్నారు. ఈ ప్రాంతాలు ప్రకృతి అందాలతో పాటు, విభిన్న జీవనశైలికి కూడా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. మహేశ్ బాబు పాత్రకు ఈ లొకేషన్లను జతచేయడం సినిమాలో మేజర్ హైలైట్ కానుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రాజమౌళి గత చిత్రాలను చూస్తే, ఆయన విజువల్ ట్రీట్ కోసం హాలీవుడ్ స్థాయిలో సెట్స్ రూపొందిస్తారు. కానీ ఈసారి మాత్రం అసలైన అడ్వెంచర్ అనుభూతిని ప్రేక్షకులకు అందించడానికి రియల్ లొకేషన్లను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ఒడిశాలోని కొరాపుట్ జిల్లా గిరిజన జీవనశైలికి దగ్గరగా ఉంటుంది. అక్కడి వాతావరణం, కట్టుదిట్టమైన అడవులు, ఎత్తైన పర్వతాలు SSMB29లో వేరే స్థాయికి తీసుకెళ్తాయని చెబుతున్నారు. అంతేకాదు, గతంలోనూ రాజమౌళి కొన్ని సినిమాల్లో భారతీయ సంస్కృతిని నమ్మకంగా చూపించిన విధంగా, ఈ సినిమాలో కూడా ఒడిశా బ్యాక్‌డ్రాప్‌లో ఒక ప్రత్యేకమైన కోణాన్ని చూపించనున్నారా అనే ఉత్కంఠ నెలకొంది.
ఇండియన్ సినిమా చరిత్రలో RRRలాంటి మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాను తీసిన రాజమౌళి, ఈసారి ఊహించిన యాక్షన్, ఎక్కువ అడ్వెంచర్ కలిగిన కథను ఎంచుకున్నట్లు సమాచారం. ఇండియాలోనే కాకుండా, ఈ సినిమా కోసం ఆఫ్రికాలోని అనేక లొకేషన్లను కూడా ఎంపిక చేశారు. ముఖ్యంగా కెన్యాలోని అడవుల్లో ప్రత్యేకమైన షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంటే, SSMB29 ఓ ఇంటర్నేషనల్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందనున్నట్లు స్పష్టమవుతోంది.
మహేష్ బాబు కెరీర్‌లో ఇదొక లైఫ్ ఛేంజింగ్ మూవీ అవుతుందనే అంచనాలు ఇప్పటి నుంచే పెరుగుతున్నాయి. పాన్ వరల్డ్ స్థాయిలో తీసుకెళ్లే ఈ సినిమాకు రాజమౌళి తనదైన నారేషన్, యాక్షన్ స్టైల్‌ను జోడించబోతున్నారు. ఇక ఒడిశాలో మొదలైన తొలి షెడ్యూల్, మహేశ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్‌కు కీలకం కానుందా? ఈ లొకేషన్ల ఎంపిక వెనుక ఎలాంటి కథనం దాగుంది? అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో మరింత పెరుగుతోంది.