రాజమౌళి - మహేష్.. టిక్కెట్ రేటుకు కిడ్నీ అమ్ముకోవలేమో!
అయితే SSMB29 1000 కోట్లు బడ్జెట్ పెట్టి చేస్తున్నారు కాబట్టి టికెట్ ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం అయితే ఉందని భావిస్తున్నారు.
దర్శక దిగ్గజం రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. 'SSMB29' వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ వర్క్ ఇప్పటికే మొదలైంది. ప్రస్తుతం మూవీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయి ప్రీప్రొడక్షన్ దశలో ఉంది. వచ్చే ఏడాదిలో మూవీ షూటింగ్ మొదలవుతుందని అనుకుంటున్నారు. ఈ సినిమాకి క్యాస్టింగ్ ని కూడా ఎంపిక చేసే పనిలో జక్కన్న ఉన్నారు. ఏకంగా 1000 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రాజమౌళి చేయబోతున్నారనే మాట వినిపిస్తోంది.
అలాగే హాలీవుడ్ రేంజ్ లోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో రాజమౌళి ఉన్నారు. దానికి తగ్గట్లుగానే హాలీవుడ్ యాక్టర్స్ ని మూవీ కోసం ఎంపిక చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యేసరికి కనీసం మూడేళ్లు సమయం పట్టొచ్చు. అంటే 2027లో 'SSMB29' రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ సమయానికి టికెట్ ధరలు కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.
'పుష్ప 2' మూవీ ప్రీమియర్స్ కి హైదరాబాద్ లో మల్టీ ప్లెక్స్ లలో టికెట్ ధర 1250 రూపాయిలుగా ఉంది. ముంబైలో అయితే 3000 రూపాయిల వరకు పలుకుతోంది. అయిన కూడా ఫ్యాన్స్ ప్రీమియర్స్ షోలలో తమ అభిమాన హీరో మూవీ చూసేందుకు టికెట్స్ కొనుగోలు చేస్తున్నారు. ఈ లెక్కన రాజమౌళి, మహేష్ బాబు సినిమాని ప్రీమియర్ షోలలో చూడాలంటే కిడ్నీలు అమ్ముకోవాలేమో అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
టికెట్ ధరలు ఈ స్థాయిలో ఉంటే సామాన్య, మధ్యతరగతి ప్రజలు ప్రీమియర్ షోలు, మొదటి రోజు సినిమాలని థియేటర్స్ లో చూడలేని పరిస్థితి వస్తుందని కొందరు నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. అయితే రాజమౌళి సినిమాలలో పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కాబట్టి టికెట్ ధరలు ఎంత అయిన చూడటానికి ఫ్యాన్స్ ఆసక్తి చూపించే అవకాశం ఉంటుందని మరి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. మూడేళ్ళ తర్వాత ప్రీమియర్ షోల టికెట్ రేట్లు కచ్చితంగా 5000 కి అమ్మే ఛాన్స్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
అయితే SSMB29 1000 కోట్లు బడ్జెట్ పెట్టి చేస్తున్నారు కాబట్టి టికెట్ ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం అయితే ఉందని భావిస్తున్నారు. వేల రూపాయిలు ఖర్చు పెట్టి థియేటర్స్ లో ప్రీమియర్ షోలు లేదంటే మొదటి రోజు సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఏ మేరకు ఆసక్తి చూపిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా ఇలా టికెట్ ధరలు పెంచుకుంటూ వెళ్లడం వలన థియేటర్స్ కి ఆడియన్స్ దూరమయ్యే అవకాశం ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. పాన్ ఇండియా సినిమాలు రావడం మంచిదే అయితే ప్రేక్షకులపై భారం పడకుండా చూడాలని, అప్పుడే లాంగ్ రన్ లో థియేటర్స్ లో సినిమాలు ఆడుతాయని కామెంట్స్ చేస్తున్నారు.