ఇది కదా రాజమౌళి అనిపించేలా..?

ముఖ్యంగా బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దిగ్గజ దర్శకుడు ఆయన;

Update: 2025-04-09 02:45 GMT
ఇది కదా రాజమౌళి అనిపించేలా..?

అందరి సినిమాలు ఒక లెక్కైతే రాజమౌళి సినిమా మరో లెక్క అన్నట్టు ఉంటుంది. ముఖ్యంగా బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దిగ్గజ దర్శకుడు ఆయన. బాహుబలి, RRR సినిమాలతో ఇంటర్నేషనల్ లెవెల్ లో తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్న జక్కన్న ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ తో భారీ ప్రాజెక్ట్ మొదలు పెట్టాడు. ఐతే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నా కూడా ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్స్ బయటకు రాలేదు.

మరోపక్క అల్లు అర్జున్, అట్లీ చేస్తున్న సినిమాకు సంబంధించిన ఒక వీడియో లేటెస్ట్ గా రిలీజై ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. పుష్ప 2 తర్వాత ఏకంగా హాలీవుడ్ అప్పీల్ తో వస్తున్నాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్, అట్లీ సినిమా అనౌన్స్ మెంట్ వీడియో అదిరిపోయింది. ఇదే కాదు బుచ్చి బాబు డైరెక్షన్ లో వస్తున్న రామ్ చరణ్ పెద్ది సినిమా ఫస్ట్ షాట్ కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించింది.

ఫస్ట్ షాట్ తోనే పెద్ది రేంజ్ ఏంటన్నది చూపించారు బుచ్చి బాబు. ఐతే ఈ రెండు భారీ సినిమాల నుంచి వచ్చిన వీడియోస్ చూసి ఇక రావాల్సింది మహేష్, రాజమౌళి సినిమా అప్డేటే అని డిస్కస్ చేస్తున్నారు. అక్కడ ఉంది రాజమౌళి కాబట్టి కంటెంట్, ఎగ్జిక్యూషన్, మేకింగ్, టేకింగ్ ఇలాంటి విషయాల్లో డౌట్లు అక్కర్లేదు. కానీ పెద్ది, అల్లు అర్జున్ 22 వీడియోస్ చూశాక సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా తమ హీరో సినిమా అప్డేట్ కావాలని ఆశిస్తున్నారు.

ఐతే రాజమౌళి SSMB 29 సినిమా కోసం ఒక 2 నిమిషాల వీడియో చేస్తున్నాడని టాక్ వచ్చింది. ఆ వీడియోతో తన విజన్ ఏంటన్నది చూపించబోతున్నాడట. తప్పకుండా ఆ అప్డేట్ ఇది కదా రాజమౌళి అని అనిపించక తప్పదు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా ఆ స్పెషల్ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.

మరోపక్క ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబో సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లింది. ఆ సినిమా నుంచి వచ్చే టీజర్ గ్లింప్స్ కోసం కూడా ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మహేష్, ఎన్ టీ ఆర్ ల సినిమాల గ్లింప్స్ వస్తే మాత్రం స్టార్ సినిమాల అప్డేట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతారని చెప్పొచ్చు.

Tags:    

Similar News