హీరోల తప్పేం లేదు..కారకులు డైరెక్టర్లే!
కానీ మరెందుకు రిలీజ్ చేయలేకపోతున్నారు అంటే అందుకు ప్రధాన కారకులు దర్శకులు అనడంలో ఎలాంటి సందేహం లేదు.;

ఏడాదికో సినిమా చొప్పున రిలీజ్ చేయాలని స్టార్ హీరోలంతా ప్రయత్నిస్తున్నా ఫలించడం లేదు. సూపర్ స్టార్ మహేష్ సైతం కొన్ని సంవత్సరాల క్రితమే ఏడాదికో సినిమా రిలీజ్ చేస్తామని ప్రామిస్ చేసారు. కానీ అది ప్రామిస్ గానే మిగిలిపోయింది తప్ప ఇంతవరకూ సాధ్యపడలేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ, ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఇలా ఫాంలో ఉన్న హీరోలంతా ఏడాదికో సినిమా రిలీజ్ చేయడంలో ఏమాత్రం వ్యతిరేకులు కాదు.
కానీ మరెందుకు రిలీజ్ చేయలేకపోతున్నారు అంటే అందుకు ప్రధాన కారకులు దర్శకులు అనడంలో ఎలాంటి సందేహం లేదు. స్టార్ డైరెక్టర్లు అంతా సరైన ప్రణాళిక లేకుండానే చిత్రాలు పట్టాలెక్కిం చడంతోనే హీరోలకు ఈ సమస్య తలెత్తుతుంది. సినిమా ప్రారంభానికి ముందు ఏ స్టార్ డైరెక్టర్ కూడా ఫలానా తేదీకి సినిమా రిలీజ్ చేస్తామని కాన్పిడెంట్ గా చెప్పలేకపోతున్నాడు. మధ్యలో ఎప్పుడో రిలీజ్ తేదీ ప్రకటిస్తున్నారు.
వాళ్ల వెసులబాటును బట్టి రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయంలో నిర్మాత ఇన్వాల్వ్ మెంట్ కూడా పెద్దగా ఉండదు. ఎందుకంటే కంటెంట్ పూర్తి చేసి ఇవ్వాల్సిన బాధ్యత డైరెక్టర్ ది. ఆ పని డైరెక్టర్ సక్రమంగా చేయలేనప్పడు నిర్మాత ఏం చేయగలడు? అడిగితే అతడితో గొడవ తప్ప మరే ఉపయోగం ఉండదు. మరి డైరెక్టర్లు ఎందుకు డిలే చేస్తున్నారంటే? ప్రాజెక్ట్ ని ఎలాంటి ప్లానింగ్ లేకుండానే పట్టాలెక్కిస్తున్నారు అన్నది కరెక్ట్ కాదు.
ప్లానింగ్ ఉన్నా? దాన్ని పర్పెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నారు? అలా ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే కచ్చితంగా అది డైరెక్టర్ వైఫల్యమే. ఓ స్టార్ హీరో సినిమా సెట్స్ కి వెళ్లిన తర్వాత అనుకున్న టైమ్ లో షూటింగ్ పూర్తి కాదు. ఇక్కడ ప్రధానంగా వినిపిస్తోంది ఏంటంటే? హీరోలు సవ్యంగా డేట్లు ఇచ్చినా వాటిని పర్పెక్ట్ గా ప్లాన్ చేసి అమలు చేయడంలో విఫలమవుతున్నారు. ఆ కారణంగా షూటింగ్ డిలే జరుగుతుంది.
`హరిహర వీరమల్లు `సినిమా విషయంలో ఇదే జరిగింది. పవన్ కళ్యాణ్ ఇచ్చిన డేట్లలో వీరమల్లు మేకర్స్ చిత్రీకరణ పూర్తి చేయలేదు. దీంతో అప్పటి నుంచి డేట్లు ఇవ్వండని అడిగినా? పవన్ డేట్లు ఇచ్చే పరిస్థితుల్లో లేరు. పవన్ రాజకీయంగా బిజీగా ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితి అనుకోవచ్చు. మరి మిగతా హీరోలంతా కేవలం సినిమాలు తప్ప మరేం చేయడం లేదుగా. ఆ చిత్రాల దర్శకుల పరిస్థితి ఏంటి? అంటే సెట్స్ కి వెళ్లిన తర్వాత రకరకాల కారణాలతో షూటింగ్ డిలే అవుతుంది.
అందులో హీరో కారణం అన్నది చాలా రేర్ గానే తెరపైకి వస్తుంది. స్క్రిప్ట్ లో అప్పటికప్పుడు అసరమైన మార్పులు చేయడం, అవసరమైన సరంజామా అందుబాటులో లేకపోవడం వంటిది ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఈ దశ దాటిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం జరుగుతుంటుంది. టెక్ని కల్ వర్క్ ఎక్కువగా ఉన్న సినిమాల విషయంలో ఈ జాప్యం అన్నది మరింత అధికంగా ఉంటుంది. ఈ లోటు పాట్లు అన్నింటి విషయంలో స్టార్ డైరెక్టర్లు సరైన ప్రణాళిక, వ్యూహంతో వెళ్తే తప్ప అధిగమించడం కష్టం. సినిమా పట్టాలెక్కడానికి ముందే వంద శాతం క్లారిటీతో డైరెక్టర్ ఉండాలి. మధ్యలో మార్పులు అనివార్య మైనా వాటిని అంతే వేగంగా పూర్తి చేయగలగాలి.