సైకిల్ పై షాక్ ఇచ్చిన స్టార్ హీరో!

క్యాపెనింగ్ లో భాగంగా పార్టీ త‌రుపున కార్య‌క‌ర్త‌ల‌కు ఎన్నో సైకిళ్ల‌ను సైతం బ‌హుమ‌తులుగా అందించిన సంద‌ర్భాలెన్నో.

Update: 2024-09-08 12:02 GMT

సైకిల్ అంటే అంద‌రికీ గుర్తొచ్చేది తెలుగు దేశం పార్టీ సింబ‌ల్. అన్న ఎన్టీఆర్ నుంచి నేటి ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు వ‌ర‌కూ సైకిల్ ప్ర‌చారంలో పాల్గొన్న‌ది ఎన్నోసార్లు. ఆ గుర్తుపై ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిరోహించింది ఇంకెన్నో సార్లు. క్యాపెనింగ్ లో భాగంగా పార్టీ త‌రుపున కార్య‌క‌ర్త‌ల‌కు ఎన్నో సైకిళ్ల‌ను సైతం బ‌హుమ‌తులుగా అందించిన సంద‌ర్భాలెన్నో.

ఇలా సైకిల్ అంటే తెలుగు ప్రజ‌ల్లో ప్ర‌త్యేక‌మై గుర్తింపు ఉంది. అయితే తాజాగా స్టార్ హీరో విశాల్ సైతం సైకిల్ ఎక్క‌డం ఆశ్చ‌ర్యంగా మారింది. నేరుగా సైకిల్ తొక్కుకుంటూ తాను చేరాల్సిన వేదిక వ‌ద్ద‌కు చేరుకున్నాడు. అలాగని విశాల్ టీడీపీ పార్టీలో చేరుకున్నారు? అనుకునేరు. అది వేరే మ్యాట‌ర్. వివ‌రాల్లోకి వెళ్తే.. న‌డిగ‌ర్ సంఘం ప్ర‌ధాన కార్య ద‌ర్శిగా ఉన్న విశాల్ 68వ సౌత్ ఇండియ‌ర్ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ స‌మావేశానికి హాజ‌ర‌య్యేందుకు కార్యాల‌యానికి నేరుగా సైకిల్ పై వ‌చ్చి అంద‌ర్ని ఆశ్చ‌ర్య ప‌రిచాడు.

సైకిల్ పై రావ‌డంతో అత‌డి అభిమానులు చుట్టు ముట్టారు. సైకిల్ పై వ‌స్తూనే గేట్ వ‌ద్ద అభిమానులతో క‌ర‌చాల‌నం చేసాడు. దీనికి సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇక ఏపీ రాజ‌కీయ ప‌రంగా చూస్తే విశాల్....మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వీరాభిమాని. అత‌ను ప్ర‌వేశ పెట్టిన సంక్షేమ ప‌థ‌కాల‌పై గ‌తంలో ఎంతో పాజిటివ్ గా స్పందించారు.

2024 లోనూ జ‌గ‌న్ సీఎం అవుతార‌ని ఫ‌లితాల‌కు ముందు ధీమా వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. కానీ అది జ‌ర‌గ‌లేద‌నుకోండి. ఈ విష‌యంలో విశాల్ అంచ‌నాలు త‌ప్పాయి. అయితే 2026 ఎన్నిక‌ల‌కు విశాల్ ఏ పార్టీకి మ‌ద్ద‌తిస్తాడు? అన్న‌ది చూడాలి. త‌ల‌ప‌తి విజ‌య్ పార్టీకే మ‌ద్ద‌తిచ్చే అవ‌కాశం ఉంది. డీఎంకే పార్టీతో విశాల్ కి వివాదాలున్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News