కమర్షియల్ సినిమా ఫార్ములా మార్చేస్తున్నారుగా..?
ఒకప్పుడు ఇలాంటి సస్పెన్స్, హార్రర్ థ్రిల్లర్ సినిమాలు లిమిటెడ్ బడ్జెట్ లో యువ హీరోలు మాత్రమే చేసేవారు. కానీ ఇప్పుడు ఆ సినిమాలను స్టార్స్ కూడా చేస్తున్నారు.
టికెట్ కొన్న ప్రేక్షకులను పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్ అందించడం కోసం మేకర్స్ అంతా ప్రయత్నిస్తారు. ఐతే కొన్నిసార్లు వారు అనుకున్న విధంగా ప్రేక్షకులను రంజింపచేయడం కుదరదు. ఇక కమర్షియల్ సినిమా అంటే రివెంజ్ స్టోరీలు, రెగ్యులర్ యాక్షన్ డ్రామాలు మధ్యలో నాలుగు సాంగ్స్ అన్నట్టు పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ప్రేక్షకులకు వరల్డ్ సినిమా చేతిలో వచ్చేసింది. అందుకే వారి అంచనాలను అందుకునేలా లేదా అంచనాలు మించేలా సినిమా ఉండాలని చూస్తారు. ఈమధ్య కాలంలో దర్శకుల పంథా పూర్తిగా మార్చేస్తున్నారు.
కమర్షియల్ సినిమా ఫార్మెట్ ని మార్చేసే ప్రయత్నం మార్చేస్తున్నారు. ముఖ్యంగా ఒకప్పుడు సినిమాల పర్సెంటేజ్ లో 5 నుంచి 10 శాతం కూడా రాని హర్రర్ థ్రిల్లర్ సినిమాలు ఇప్పుడు 40 శాతం దాకా పెరిగాయి. ఒకప్పుడు ఇలాంటి సస్పెన్స్, హార్రర్ థ్రిల్లర్ సినిమాలు లిమిటెడ్ బడ్జెట్ లో యువ హీరోలు మాత్రమే చేసేవారు. కానీ ఇప్పుడు ఆ సినిమాలను స్టార్స్ కూడా చేస్తున్నారు.
త్వరలో రాబోతున్న రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ హారర్ థ్రిల్లర్ గా వస్తుంది. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య వస్తుంది. ఈ సినిమాతో పాటుగా నాగ చైతన్య కార్తీక్ దండు కాంబో సినిమా కూడా హర్రర్ థ్రిల్లర్ గా వస్తుంది. ధూతతో థ్రిల్లర్ వెబ్ సీరీస్ చేశాక ఇలాంటివి ఆడియన్స్ ఎంతగ ఆదరిస్తారో రుచి చూసిన చైతన్య థ్రిల్లర్ కథల మీద ఆసక్తి పెంచుకున్నాడు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా తన నెక్స్ట్ సినిమా మేర్లపాక గాంధితో కొరియన్ కనకరాజు అంటూ థ్రిల్లర్ కథతో వస్తున్నాడని తెలుస్తుంది. మట్కా ఫ్లాప్ తర్వాత థ్రిల్లర్ కథతో ప్రేక్షకులను అలరించాలని ఫిక్స్ అయ్యాడు వరుణ్ తేజ్. వీటితో పాటుగా బెల్లంకొండ శ్రీనివాస్ కిష్కింధపురి కూడా థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ తో వస్తుంది. ఈ సినిమాలన్నీ కూడా థియేటర్ లో ప్రేక్షకులను భయపెడుతూ వారిని ఎంటర్టైన్ చేయాలని చూస్తున్నాయి. పొమేర 2 హిట్ అవ్వడంతో పొలిమేర 3 ప్లానింగ్ లో ఉంది. సంపత్ నంది ఓదెల 2 కూడా ఇదే థ్రిల్లర్ అంశాలతో రాబోతుందని తెలుస్తుంది.వీటితో పాటుగా కోలీవుడ్ నుంచి అరణ్మయి 4, శ్రీ గాంధారి సినిమాలు వస్తున్నాయి.