స్టార్ హీరో అరెస్ట్‌కు షాకింగ్ రీజన్?
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) బాంద్రా కార్యాలయంలో కొంత విచారంగా ఉన్న విద్యుత్ జమ్వాల్ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో కనిపించింది.
ప్రమాదకర స్టంట్స్ చేయడంలో అతడు తనకు తానే సాటి. పెద్ద తెరపై గొప్ప సాహసవిన్యాసాలతో అలరిస్తుంటాడు. మార్షల్ ఆర్ట్స్ లో ప్రవీణుడు కావడంతో అతడికి మాస్ యాక్షన్ సినిమాల్లో అవకాశాలొస్తున్నాయి. ప్రతిసారీ తన యాక్షన్ ఇమేజ్ కి తగ్గట్టే ప్రతి పాత్రను ఎంతో ఛాలెంజింగ్ గా చేసి చూపించడంలో అతడు తన ప్రత్యేకతను చాటుతూనే ఉన్నాడు. ప్రఖ్యాత లూపర్ క్యూరేట్ చేసిన ప్రతిష్టాత్మక జాబితా(మార్షల్ ఆర్ట్స్ స్పెషలిస్టుల జాబితా)లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడిగాను అతడు రికార్డ్ లకెక్కాడు. అయితే అలాంటి ప్రతిభావంతుడు ఇటీవల ఊహించని ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.
అతడిని పోలీసులు అరెస్ట్ చేసారు. స్టేషన్ లో కూచోబెట్టి చాలా సేపు విచారించారు. అందుకు సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ అవుతోంది. స్టార్ హీరో అరెస్ట్ వెనక కారణాలేమిటో తెలుసుకోవాలన్న ఆత్రం పెంచింది ఈ ఫోటోగ్రాఫ్. ఇంతకీ అతడిని ఎందుకు అరెస్ట్ చేసారు? అంటే తెలిసిన కారణం షాకిస్తోంది.
ఇంతకీ ఎవరా స్టార్ హీరో? అంటే.. పేరు విద్యుత్ జమ్వాల్. 'తుపాకి' చిత్రంతో తెలుగు వారికి సుపరిచితుడు. ప్రమాదకర విన్యాసాలు చేసినందుకు విద్యుత్ జమ్వాల్‌ను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తన తదుపరి చిత్రం 'క్రాక్ జీతేగా తో జియేగా' ప్రమోషన్‌లో బిజీగా ఉన్న విద్యుత్ జమ్వాల్‌ను రిస్కీ స్టంట్స్ చేసినందుకు రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని వివరణ అడిగారు.
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) బాంద్రా కార్యాలయంలో కొంత విచారంగా ఉన్న విద్యుత్ జమ్వాల్ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో కనిపించింది. పోలీసుల విచారణ తర్వాత అతడు అక్కడి నుంచి నిష్క్రమిస్తున్నట్లు మరొక ఫోటో కూడా వైరల్ అయింది. RPF కార్యాలయం బాంద్రా రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ 1లో ఉంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, రిస్కీ స్టంట్స్ చేసినందుకు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారట. అయితే ఈ అభియోగంపై ఇంకా అధికారిక ధృవీకరణ లేదు.
శుక్రవారం నాడు ముంబైలో గ్రాండ్ ట్రైలర్ లాంచ్‌లో 'క్రాక్ జీతేగా తో జియేగా' ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, నోరా ఫతేహీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆదిత్య దత్ దర్శకత్వం వహించారు. విద్యుత్ జమ్వాల్ - అబ్బాస్ సయ్యద్ నిర్మించారు. ఆదిత్య దత్, రెహాన్ ఖాన్, సరిమ్ మోమిన్, మోహిందర్ ప్రతాప్ సింగ్ స్క్రీన్ ప్లే రాశారు. ఫిబ్రవరి 23 న మూవీ థియేటర్లలోకి వస్తుంది. అర్జున్ రాంపాల్ వర్సెస్ విద్యుత్ జమ్వాల్ ఎపిసోడ్స్ ఈ చిత్రంలో ఆద్యంతం రక్తి కట్టించబోతున్నాయి. ఈ చిత్రంలో నటించడం శారీరకంగా ఎంత సవాలుతో కూడుకున్నదో ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.