స్టార్ హీరోయిన్ కి ఇంత పెద్ద కూతురా?
బాలీవుడ్ కు చెందిన వైరల్ భయానీ సోషల్ మీడియా అకౌంట్ లో వీడియోను షేర్ చేసి విద్యా బాలన్, ఆమె కూతురు అన్నట్లుగా కామెంట్ పెట్టారు.
డర్టీ పిక్చర్ హీరోయిన్ విద్యాబాలన్ తాజాగా ఎయిర్ పోర్ట్ లో ఒక పాపతో కలిసి మీడియా కంట పడింది. దాదాపు తన ఎత్తు ఉన్న ఆ పాప విద్యా బాలన్ కూతురు అన్నట్లుగా కొందరు బాలీవుడ్ మీడియా వర్గాల వారు సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. బాలీవుడ్ కు చెందిన వైరల్ భయానీ సోషల్ మీడియా అకౌంట్ లో వీడియోను షేర్ చేసి విద్యా బాలన్, ఆమె కూతురు అన్నట్లుగా కామెంట్ పెట్టారు.
బాలీవుడ్ మీడియా వారు విద్యా బాలన్ తన కూతురు తో అంటూ ఈ వీడియోను తెగ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆమె అభిమానులతో పాటు సాధరణ జనాలు కూడా షాక్ అవుతున్నారు. విద్యా బాలన్ కి పెళ్లి అయిన చాలా కాలం అయింది. అయితే ఆమె కూతురు విషయం ఇప్పటివరకు మీడియా కు తెలియలేదే. మరీ ఇంత పెద్ద పాప ఉందా అంటూ చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మీడియాలో వస్తున్న వార్తలు మరియు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో కి సంబంధించి విద్యా బాలన్ క్లారిటీ ఇచ్చింది. ఆ వీడియో లో తనతో ఉన్న అమ్మాయి పేరు ఐరా. తను నా సొంత కూతురు కాదు. నా సోదరి యొక్క కవల పిల్లలో ఒక పాప. ఐరా ఎక్కువ నాతోనే ఉంటుంది. తనతో నాకు మంచి బాండింగ్ ఏర్పడింది అన్నట్లుగా విద్యాబాలన్ క్లారిటీ ఇచ్చింది.
పెళ్లి అయి ఇన్నాళ్లు అయినా కూడా ఎందుకు పిల్లలు లేరు అంటూ విద్యా బాలన్ ను కొందరు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తూ ఉంటారు. ఆ విషయమై గతంలో కానీ, ఈ మధ్య కాలంలో కానీ విద్యా బాలన్ స్పందించలేదు. కానీ ఐరా విషయంలో వెంటనే స్పందించి తన కూతురు కాదు అన్నట్టుగా క్లారిటీ ఇచ్చింది.