స్టార్ హీరో రియ‌ల్ దందా రెట్టించిన వేగంతోనా?

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఆ పాన్ ఇండియా స్టార్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. బ్యాక్ టూ బ్యాక్ స‌క్సెస్ ల‌తో దూసుకుపోతున్నాడు

Update: 2024-08-02 11:03 GMT

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఆ పాన్ ఇండియా స్టార్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. బ్యాక్ టూ బ్యాక్ స‌క్సెస్ ల‌తో దూసుకుపోతున్నాడు. అంత‌కుముందు వేగం బాగా త‌గ్గినా..ఇప్పుడు రెట్టించిన వేగంతో దూసుకు పోతున్నాడు. రెండు వైఫ‌ల్యాలు వెన‌క్కి లాగితే ఒక్క హిట్ తో ఆ రెండిటిని క‌వ‌ర్ చేసేస్తున్నాడు. అంత‌కు మించి లాభాలు చూస్తున్నాడు. అడ్వాన్సులుగానూ కోట్ల రూపాయ‌లు వ‌చ్చి ప‌డుతున్నాయి.

సినిమాలో షేర్ ద‌క్కుతుంది. మ‌రి ఈ సంపాద‌న అంతా ఏం చేస్తున్నాడు? అంటే ఆ స్టార్ హీరో బెస్ట్ ఇన్విస్టెర్ అన్న‌ది అత‌డికి ముందు నుంచే తెలిసిందే. అత‌డి వ్యాపార సామ్రాజ్యం ఇప్ప‌టికే విదేశాల‌కు పాకింది. తెలుగు రాష్ట్రాల‌తోపాటు, ముంబై, బెంగుళూరు లాంటి మ‌హాన‌గ‌రాల్లోనూ భారీగా భూముల‌పై, విల్లాల‌పై పెట్టుబ‌డులు పెట్టాడు. తాజాగా అత‌డి రియ‌ల్ ఎస్టేట్ ని మ‌రింత విస్త‌రిస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.

ఇప్ప‌టికే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఖరీదైన భూములు ఉన్నాయి. విలాస‌వంత‌మైన ఫామ్ హౌస్ లున్నాయి. ఆ మ‌ధ్య న‌గ‌రం న‌డిబొడ్డున సైతం ఓఫామ్ హౌస్ నిర్మించిన‌ట్లు వార్త‌లొచ్చాయి. ఇటీవల ఇటలీలో ఖరీదైన విల్లాను కూడా కొనుగోలు చేశాడు. సినిమా రిలీజ్ అయిన అనంత‌రం అక్క‌డే ఆ స‌క్సెస్ ని స్నేహితులతో క‌లిసి ఎంజాయ్ చేస్తాడు. ఇట‌లీ వెళ్లాడంటే ఓ ఇర‌వై రోజులైనా అక్క‌డ స్పెండ్ చేస్తాడు.

అవ‌న్నీప‌క్క‌న‌బెడితే ఈ మ‌ధ్య చేతికి అందిన డ‌బ్బును భారీ మొత్తంలో రియ‌ల్ ఎస్టేట్ లో కొత్త పెట్టుడిగా పెట్టాడుట‌. ప్ర‌ధాన సిటీల‌న్నింటిలో ఆ పెట్టుబ‌డి భాగ‌స్వామ్యంగా ఉంద‌ని అంటున్నారు. రాజుగారు త‌లుచుకుంటే దెబ్బ‌లు కొద‌వా? అన్న‌ట్లు వంద‌ల కోట్ల రూపాల ఆదాయం వ‌స్తుంటే? పెట్టుబ‌డి పెట్ట‌డానికి ఆలోచించాల్సిన ప‌నేముంటుంది. న‌ష్టాలొస్తే చేతి స్పీడ్ త‌గ్గుతుంది కానీ...న‌ష్టాలే రాని ఆ చేతికి స్పీడ్ త‌ప్పా ఇంకేం తెలియ‌దు.

ప్రభాస్ త్వరలో రాజా సాబ్ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించి, వచ్చే ఏడాది వేసవిలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అతను నాగ్ అశ్విన్ యొక్క కల్కి సీక్వెల్‌తో పాటు హను రాఘవపూడి యొక్క ఫౌజీ మరియు సందీప్ వంగా యొక్క స్పిరిట్‌లను కలిగి ఉన్నాడు.

Tags:    

Similar News