నెంబర్ వన్ స్త్రీ 2.. ఆ బడా హీరోను కూడా కొట్టేసింది

దీంతో చాలా థియేటర్స్ లలో 'స్త్రీ 2' చిత్రాన్ని కొనసాగిస్తున్నారు.

Update: 2024-09-19 03:46 GMT

బాలీవుడ్ లో ‘స్త్రీ 2’ మూవీ రికార్డుల పరంపర కొనసాగుతోంది. ఈ సినిమా ఆరంభం నుంచి నిలకడగా మంచి వసూళ్ళని అందుకుంటూ 50 రోజుల దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా నార్త్ ఇండియన్ బెల్ట్ లో ఇప్పటికి ఈ సినిమాకి ఆదరణ లభిస్తోంది. హిందీలో ఈ నెల రోజుల్లో చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ రిలీజ్ కాలేదు. దీంతో చాలా థియేటర్స్ లలో ‘స్త్రీ 2’ చిత్రాన్ని కొనసాగిస్తున్నారు. ప్రేక్షకులు కూడా ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు.

ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా ‘స్త్రీ 2’ మూవీ 826 కోట్లకి పైగా కలెక్షన్స్ ని అందుకుంది. 50 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ‘స్త్రీ 2’ ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో అత్యధిక ప్రాఫిట్ తీసుకొచ్చిన చిత్రంగా ఇప్పుడు నిలిచింది. ఇప్పట్లో మరి ఏ మూవీ కూడా ‘స్త్రీ 2’ సినిమా రికార్డుని బ్రేక్ చేయలేకపోవచ్చు. ఇదిలా ఉంటే నార్త్ ఇండియాలో ‘స్త్రీ 2’ మూవీ కలెక్షన్స్ జవాన్ ఆల్ టైం వసూళ్ల రికార్డ్ ని బ్రేక్ చేసింది.

షారుఖ్ ఖాన్ ‘జవాన్’ మూవీ హిందీలో 564 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని లాంగ్ రన్ లో కలెక్ట్ చేసింది. దీనిని ‘స్త్రీ 2’ మూవీ దాటేసి 586 కోట్ల కలెక్షన్స్ ని ఇప్పటి వరకు అందుకుంది. ఇదే స్పీడ్ లో 50 రోజుల పాటు కొనసాగితే 600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని హిందీలో అందుకునే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. నార్త్ ఇండియన్ బెల్ట్ లో ఇన్ని రోజులు అత్యధిక కలెక్షన్స్ జాబితాలో ‘జవాన్’ తర్వాత ‘బాహుబలి 2’, ‘కేజీఎఫ్ చాప్టర్ 2’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సౌత్ సినిమాలు ఉండేవి.

ఇప్పుడు వాటిని ‘స్త్రీ 2’ మూవీ క్రాస్ చేసి టాప్ లోకి వెళ్లి కూర్చుంది. మళ్ళీ ‘స్త్రీ 2’ మూవీ కలెక్షన్ రికార్డ్ ని బ్రేక్ చేసే సత్తా ‘పుష్ప 2’కి ఉందని ఓ వర్గం ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. కానీ అది అంత సాధ్యం కాదు. హిందీ బెల్ట్ లో ‘పుష్ప 2’పై ఎక్కువ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ ఈ రేంజ్ లో రికార్డ్ అందుకోవాలి అంటే టాక్ అద్భుతంగా ఉండాలి. ప్రమోషన్స్ కూడా నెవ్వర్ బిఫోర్ అనేలా ఉండాలి. మరి పుష్ప 2 టీమ్ ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News