సెన్షేషనల్ మూవీ ఓటీటీ లో వచ్చేసింది, కానీ...!
ఇప్పటి వరకు ఏ హిందీ సినిమా సాధించని వసూళ్లను ఈ సినిమా దక్కించుకుని సంచలనం సృష్టించింది.
శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు ముఖ్య పాత్రల్లో అమర్ కౌశిక్ దర్శకత్వంలో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'స్త్రీ 2' సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. వరల్డ్ బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.800 కోట్ల వసూళ్లు నమోదు చేసిన ఈ సినిమా ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. ఇప్పటి వరకు ఏ హిందీ సినిమా సాధించని వసూళ్లను ఈ సినిమా దక్కించుకుని సంచలనం సృష్టించింది. ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా, హర్రర్ కామెడీ సినిమా ఈ స్థాయి వసూళ్లు సాధించడం ఏంటంటూ మొత్తం సినిమా లోకం ఆశ్చర్యం వ్యక్తం చేసి, ఇంతకు స్త్రీ 2 లో ఏం ఉందంటూ చర్చించుకోవడం మొదలు పెట్టారు.
ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పటి నుంచి ఇప్పటి వరకు వార్తల్లో నిలుస్తూనే ఉంది. మొదటి వంద కోట్ల వసూళ్లు నమోదు చేసిన సమయంలోనే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలాంటిది ఏకంగా రూ.800 కోట్ల వసూళ్లకు చేరువ అవ్వడం అంతా షాకింగ్ ను కలిగించింది. నాలుగు వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుందని ఎదురు చూసిన ప్రేక్షకులకు ఆరు వారాలు అయినా ఇంకా ఓటీటీ లోకి రాలేదు. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. అయితే ఈ సినిమాను చూడ్డానికి రూ.349 అద్దె చెల్లించాల్సి ఉంటుంది.
రెండు లేదా మూడు వారాల పాటు ఇలా అద్దె చెల్లించి స్త్రీ 2 చూడాల్సి ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి హిందీ వర్షన్ ను మాత్రమే అద్దె చెల్లించి చూసే విధంగా అమెజాన్ ప్రైమ్ అందుబాటులో ఉంచింది. ముందు ముందు ఇతర సౌత్ భాషల్లోనూ స్త్రీ 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రేక్షకులు మాత్రం అమెజాన్ లో ఎప్పుడు ఎప్పుడు ఫ్రీగా చూస్తామా అంటూ ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో హిట్ అయిన సినిమాలను ఇలా అద్దె చెల్లించి చూసే విధానంను అమెజాన్ ప్రైమ్ మొదలు పెట్టింది. సబ్‌స్క్రిప్షన్ ఉన్నా అద్దె చెల్లించాల్సిన అవసరం ఏంటని ఓటీటీ ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
స్త్రీ 2 కి వచ్చిన కలెక్షన్స్, పబ్లిసిటీ కారణంగా అన్నిభాషల ప్రేక్షకులు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా స్త్రీ 2 ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో అమెజాన్ ఇలా చేయడంతో చాలా మంది ఓటీటీ ప్రేక్షకులు, అమెజాన్ ఖాతాదారులు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భారీ మొత్తంలో ఆదాయం సంపాదించిన స్త్రీ 2 మేకర్స్ ఇప్పుడు ఓటీటీ లో రెంట్ ఆన్ డిమాండ్ పద్దతిలో తీసుకు రావడం ద్వారా మరింత ఆధాయంను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి స్త్రీ 2 తో నిర్మాతలకు అన్ని విధాలుగా భారీ లాభాలు చేకూరుతున్నాయి.