మిస్టర్ బచ్చన్ - డబుల్ ఇస్మార్ట్.. స్త్రీ2 గట్టిగానే దెబ్బేస్తోంది

ఆదివారం ఈ సినిమాల బుకింగ్స్ పరంగా చూసుకుంటే టాప్ లో హిందీ మూవీ స్త్రీ2 ఉంది.

Update: 2024-08-18 06:10 GMT

ఆగష్టు 15 సందర్భంగా తెలుగు, తమిళ్, హిందీ భాషలలో మొత్తం 9 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో తెలుగులో ఆయ్, తమిళంలో తంగలాన్, హిందీలో స్త్రీ2 పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఈ సినిమా ఈ వీకెండ్ విన్నర్స్ గా ఆయా భాషలలో నిలిచాయి. హిందీ సినిమాలకి నైజాంలో ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో మంచి ఆదరణ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హైదరాబాద్ లో హిందీ మాట్లాడేవారి సంఖ్య ఎక్కువ ఉంటుంది.

అందుకే ఇక్కడ బాలీవుడ్ సినిమాలు మంచి కలెక్షన్స్ అందుకుంటాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ కలుపుకొని మొత్తం 241 థియేటర్స్ ఉన్నాయి. వీటిలో తెలుగు సినిమాలతో పాటు హిందీ సినిమాలు మూడు రిలీజ్ అయ్యాయి. ఆదివారం ఈ సినిమాల బుకింగ్స్ పరంగా చూసుకుంటే టాప్ లో హిందీ మూవీ స్త్రీ2 ఉంది. ఈ సినిమాకి 150 షోలు ఆదివారం పడుతూ ఉండగా అందులో ఏకంగా 132 షోలకి టికెట్స్ మేగ్జిమమ్ బుక్ అయిపోయాయంట.

దీనిని బట్టి సినిమాకి ఏ స్థాయిలో ఆదరణ లభిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఆయ్ మూవీకి 82 షోలు పడుతుంటే 48 షోలకి కంప్లీట్ టికెట్స్ సోల్డ్ అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో టికెట్స్ బుకింగ్స్ బట్టి ప్రేక్షకాదరణ చూసుకుంటే ఆయ్ రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో కమిటీ కుర్రోళ్ళు ఉండటం విశేషం. ఈ సినిమా 40 షోలకి 25 షోలు మేగ్జిజమ్ టికెట్స్ బుక్ అయ్యాయంట. నాలుగో స్థానంలో చియాన్ విక్రమ్ తంగలాన్ నిలిచింది.

ఈ సినిమాకి 103 షోలు పడుతున్నాయి. వీటిలో 23 షోలు ఆల్ మోస్ట్ టికెట్స్ బుక్ అయిపోయినట్లు సమాచారం. అక్షయ్ కుమార్ ఖేల్ ఖేల్ మే సినిమా 50 షోలకి 10 షోలు టికెట్ బుకింగ్స్ హౌస్ ఫుల్ అయినట్లు తెలుస్తోంది. జాన్ అబ్రహం వేదా సినిమాకి 40షోలు పడుతుండగా 3 షోలకి ఆల్ మోస్ట్ టికెట్స్ అమ్ముడైపోయాయంట.

ఇక కమర్షియల్ యాక్షన్ చిత్రాలుగా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ మూవీకి 170 షోలు పడుతుండగా కేవలం ఒక్క షో మాత్రమే మెజారిటీ టికెట్స్ బుక్ అయ్యాయంట. మిస్టర్ బచ్చన్ సినిమా 140 షోలకి అస్సలు ఒక్కటి కూడా హౌస్ ఫుల్ పడలేదని తెలుస్తోంది. దీనిని బట్టి డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ సినిమాలకి ప్రేక్షకాదరణ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

Tags:    

Similar News