టాలీవుడ్ లో మోగిన సమ్మె సైరన్!
తమ సమస్యల్ని వెంటనే పెంచాలని వెహికల్ ఓనర్స్ అసోసియేషన్ చైర్మన్ విజయ్ కుమార్- ప్రెసిడెంట్ హనీఫ్ కోరారు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సమ్మె సైరన్ మ్రోగింది. వేతనాలు..వెహికల్ రెంట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు సినిమా అండ్ టీవీ ఓనర్స్ అసోసియేషన్ బంద్ కి పిలుపునిచ్చింది. తమ డిమాండ్లు నెరవేరే వరకూ సమ్మె కొనసాగుతుందని అల్టిమేటం జారీ చేసారు. తమ సమస్యల్ని వెంటనే పెంచాలని వెహికల్ ఓనర్స్ అసోసియేషన్ చైర్మన్ విజయ్ కుమార్- ప్రెసిడెంట్ హనీఫ్ కోరారు. `16 సంవత్సరాల నుంచి పరిశ్రమలో ఉన్నాం.
దాదాపు 900 వెహికల్స్ మా అసోసియేషన్ లో ఉన్నాయి. ఇందులో 1200మంది ఓనర్లు సభ్యులుగా ఉన్నారు. గతంలో నిర్మాతల మండలికి మా సమస్యలు చెప్పినా పట్టించుకోలేదు. ఈరోజు లేదా రేపు మరోసారి చర్చలు జరుపుతాం. సఫలమైతే విరమిస్తాం..లేదంటే కొనసాగిస్తాం` అని తెలిపారు. టాలీవుడ్ లో బంద్ జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడ షూటింగ్ లు అక్కడ ఆగిపోతాయి. కార్మికులకు పని దొరకని పరిస్థితి ఏర్పడుతుంది.
సినిమా ఇండస్ట్రీని నమ్ముకుని వేల కుటుంబాలు బతుకుతున్నాయి. షూటింగ్స్ నడిస్తేనే వారి జీవనం నడుస్తుంది.
అంతా రోజువారి వేతనం ప్రకారమే పనిచేస్తారు. ఆరోజు వేతనం తీసుకోకపోతే తినే పరిస్థితి కూడా ఉండదు. ఒక్కోసారి పది-పదిహేను రోజులు కూడా కొనసాగుతుంది. అలాంటి సమయంలో అసోసిషేన్ తో పాటు అంతా నానా అవాస్థలు పడాల్సిందే. ఇండస్ట్రీలో ఏ అసోసియేషన్ సమ్మె సైరన్ మోగించినా అంతా ఇబ్బంది పడాల్సిందే.
పరిశ్రమలో ఎన్నో రకాల సంఘాలున్నాయి. సంఘంతో దర్శక-నిర్మాత సంఘాల చర్చలు ఆరోగ్యకరమైన వాతావరణంలోనే జరుగుతుంటాయి. తాజా సమస్యని గతంలో నిర్మాతల మండలి దృష్టికి సమస్యని తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతోనే మళ్లీ సమ్మెకి దిగినట్లు తెలుస్తోంది.