'అమరన్‌' వివాదం... బ్లర్‌ చేసిన మేకర్స్‌

శివ కార్తికేయన్‌ హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌గా వచ్చిన 'అమరన్‌' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

Update: 2024-12-09 09:16 GMT

శివ కార్తికేయన్‌ హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌గా వచ్చిన 'అమరన్‌' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వరల్డ్‌ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏకంగా రూ.300+ కోట్ల వసూళ్లను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. వంద కోట్ల వసూళ్లు నమోదు అయితే గొప్ప విషయం అనుకుంటే ఏకంగా మూడు రెట్ల అధిక వసూళ్లు నిర్మాతలకు దక్కాయి. సినిమాకు వచ్చిన పాజిటివ్‌ టాక్‌ నేపథ్యంలో ఓటీటీ రైట్స్ సైతం రికార్డ్‌ స్థాయికి అమ్ముడు పోయాయి అంటూ తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

సినిమా విడుదల అయిన అప్పటి నుంచి ఒక విద్యార్థి తన అనుమతి లేకుండా తన ఫోన్ నెంబర్‌ ను సినిమాలో ఉపయోగించారు, తనకు అప్పటి నుంచి అపరిచిత వ్యక్తుల నుంచి పెద్ద ఎత్తున కాల్స్ వస్తున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు, ఏకంగా కోర్టుకు వెళ్లి తనకు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా కోరడం జరిగింది. తనకు జరిగిన నష్టంకు ఏకంగా రూ.1 కోటి చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేస్తూ ఉన్నాడు. సోషల్‌ మీడియాలో ఈ విషయం ప్రధానంగా చర్చ జరగడంతో సినిమా గురించి మరింత ఆసక్తి పెరిగింది. అయితే నిర్మాతలు మాత్రం అప్పుడు స్పందించలేదు.

తాజాగా సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్‌లో రిలీజ్ అయినప్పటి కంటే ఓటీటీ లో రిలీజ్ అయినప్పుడు ఈ సినిమాకి ఎక్కువ ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమా గురించి సోషల్‌ మీడియాలో ప్రముఖంగా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సినిమాలోని తన నెంబర్‌ వల్ల మరింతగా అసౌకర్యం కలుగుతుంది అంటూ అతడు మరోసారి కోర్టును ఆశ్రయించడం జరిగింది. దాంతో కోర్టు ఈ విషయమై ఏం తీర్పు ఇస్తుందా అంటూ ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఈ వివాదంపై చిత్ర యూనిట్‌ సభ్యులు స్పందించారు.

ఓటీటీ ద్వారా వచ్చిన ఈ సినిమాలో ఆ నెంబర్‌ను కనిపించకుండా బ్లర్‌ చేసినట్లుగా మేకర్స్ తెలియజేశారు. అతడికి కలిగిన అసౌకర్యంకు చింతిస్తున్నాం అంటూ పేర్కొన్నారు. అయితే అతడు మాత్రం తన వాదన కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే తనకు జరిగిన నష్టంకు ప్రతిఫలం ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్‌ చేస్తూ ఉన్నాడు. సోషల్‌ మీడియాలోనూ ఆ నెంబర్‌ను చాలా మంది షేర్ చేస్తూ ఉన్నారు. కనుక ఏం చేయాలి అంటూ అతడు కోర్టు ముందు నిర్మాతలను ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News