మోక్షజ్ఞ న్యూ లుక్.. యాక్షన్ తోనే మొదటి వేట

నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ హీరోగా ఎప్పుడూ ఎంట్రీ ఇస్తాడా అని ఫ్యాన్స్ అయితే వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Update: 2024-11-29 06:09 GMT

నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ హీరోగా ఎప్పుడూ ఎంట్రీ ఇస్తాడా అని ఫ్యాన్స్ అయితే వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక అతని మొదటి సినిమా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కనున్న ఈ సూపర్ హీరో మూవీ కోసం లుక్ పరంగా ఇప్పటికే మోక్షజ్ఞ సిద్ధమైపోయారు. సినిమా నుంచి అతని ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు. చాలా స్టైలిష్ గా హ్యాండ్సమ్ గా యూత్ కి కనెక్ట్ అయ్యే లుక్స్ తో మోక్షజ్ఞ కనిపించాడు.

నందమూరి అభిమానులు కోరుకునే అన్ని ఫీచర్స్ కూడా మోక్షజ్ఞలో ఉన్నాయని ఆ పోస్టర్ చూసిన తర్వాత కామెంట్స్ వినిపించాయి. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. డిసెంబర్ 5న మూవీ ఓపెనింగ్ తో అసలు హడావుడి మొదలు కానుంది. అదే రోజు మరొక పోస్టర్ కూడా విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మోక్షజ్ఞకి సంబందించిన న్యూ లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అస్సలు ఎక్స్ పెక్ట్ చేయని రేంజ్ లో సరికొత్తగా మోక్షజ్ఞ ఈ లుక్ లో కనిపిస్తూ ఉండటం విశేషం.

చెక్స్ షర్టుతో కాస్తా షార్ప్ గా ఉన్న గెడ్డంతో. లాంగ్ హెయిర్ స్టైల్ తో కాన్ఫిడెంట్ లుక్స్ తో మోక్షజ్ఞ ఈ ఫోటోలో కనిపిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ ఈ ఫోటోని షేర్ చేసి రెడీ టూ సమ్ యాక్షన్ అని హింట్ ఇచ్చేశాడు. దీనిని బట్టి అతను షూటింగ్ కి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఫస్ట్ షెడ్యూల్ ని యాక్షన్ ఎపిసోడ్స్ తో స్టార్ట్ చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారు. మొదటి చిత్రంలోనే సూపర్ హీరోగా మోక్షజ్ఞ కనిపించబోతూ ఉండటంతో నందమూరి ఫ్యాన్స్ కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు.

డిసెంబర్ 5న మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్న నేపథ్యంలో ఆ రోజు మరో కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాని SLV సినిమాస్ బ్యార్ పై సుధాకర్ చెరుకూరి, లెజెండ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తేజస్విని నందమూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కనుంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గానే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాబోతున్నారు.

వచ్చే ఏడాది మూవీ రిలీజ్ అవ్వొచ్చని అనుకుంటున్నారు. ఈ సినిమాలో మోక్షజ్ఞకి జోడీగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ రవీనా కూతురు రషా తడాని నటించబోతుననట్లు తెలుస్తోంది. త్వరలో దీనికి సంబందించిన క్లారిటీ మేకర్స్ నుంచి రావొచ్చని అనుకుంటున్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి రాబోతున్న ఈ కొత్త తరం హీరో టాలీవుడ్ లో ఏ మేరకు సక్సెస్ అవుతాడనేది వేచి చూడాలి.

Tags:    

Similar News