అడ్వెంచర్ ‘సుబ్రహ్మణ్య’.. గ్లింప్స్ తోనే కిక్కిచ్చారు
డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న P రవి శంకర్ త్వరలోనే ఒక అద్భుతమైన ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న P రవి శంకర్ త్వరలోనే ఒక అద్భుతమైన ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన వారసుడు అద్వయ్ ను హీరోగా పరిచయం చేస్తూ రవిశంకర్ దర్శకత్వ బాధ్యతలు తీసుకోవడం విశేషం. పాన్ ఇండియా స్థాయిలో భారీగా సుబ్రహ్మణ్య అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించిన తొలి గ్లింప్స్ ఇటీవల విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.
ఎస్జి మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను తిరుమల రెడ్డి, అనిల్ కడియాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ కథ సోషియో ఫ్యాంటసీ అడ్వెంచర్ నేపథ్యంలో రూపొందుతుండటం విశేషం. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో అద్వయ్ తెరంగేట్రం చేస్తున్నారు. దుబాయ్ లో జరిగిన ఒక ప్రముఖ అవార్డు ఫంక్షన్ లో విడుదలైన ఈ గ్లింప్స్, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం చూసేలా గ్రాండ్‌గా లాంచ్ చేశారు.
ఇందులో చూపించిన విజువల్స్, గ్రాఫిక్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. ముఖ్యంగా, అద్వయ్ స్నేక్స్ తో నిండిన బావిలోకి దూకి, ప్రాచీన పుస్తకాన్ని తీసుకొని, వాటి నుంచి తప్పించుకునే సీక్వెన్స్ ఆసక్తిని పెంచాయి. అలాగే ఆ అడవిలో వానర సైన్యం ఒక దేవాలయం కనిపిస్తోంది. ఇక శ్రీరాముడికి సంబంధించిన ఒక సరికొత్త పాయింట్ ను తెరపై చూపించనున్నట్లు తెలుస్తోంది.
వీఎఫ్ఎక్స్ పరంగా సుబ్రహ్మణ్య చిత్రం ప్రేక్షకులకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుందని గ్లింప్స్ ద్వారా అర్థమైంది. ప్రాచీన కాలానికి సంబంధించిన అంశాలు సినిమాపై మరింత కుతూహలం రేకెత్తిస్తున్నాయి. ఆఖరి షాట్‌లో కనిపించే సీన్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఈ గ్లింప్స్ ద్వారా సుబ్రహ్మణ్య చిత్రంపై అంచనాలు పెరిగాయి. ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
అద్వయ్ తన నటనతో స్క్రీన్‌పై ఆకట్టుకుంటున్నాడు. విదేశాలలో ప్రత్యేక శిక్షణ పొందిన ఆయన, గ్లింప్స్ లో చూపిన ఆత్మవిశ్వాసం, భావోద్వేగాలు, ఆక్షన్ సన్నివేశాలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. దర్శకుడు పి. రవిశంకర్, ఓ విలక్షణమైన ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టిస్తూ, కొత్త అనుభవాన్ని అందించబోతున్నారు. విజ్ఞేశ్ రాజ్ సినిమాటోగ్రఫీకి ప్రత్యేకంగా గుర్తింపు రావడం ఖాయం. రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి సన్నివేశాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లింది.
ఈ ప్రాజెక్ట్ కోసం 60కి పైగా వీఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు నాలుగు నెలల పాటు శ్రమించి విజువల్స్‌ను అత్యంత అద్భుతంగా రూపొందించారు. చిత్రానికి ప్రముఖ రంగుల గ్రేడింగ్ సంస్థ రెడ్ చిల్లీస్.కలర్ పనిచేయడం విశేషం.
సినిమాను ప్రీమియం లార్జ్ ఫార్మాట్ మరియు ఐమాక్స్ థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కథాంశం, విజువల్స్, ఎమోషన్స్ అందరికీ చేరువయ్యేలా రూపొందించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.