'నవ దళపతి'.. ట్యాగ్ పై సుధీర్ పవర్ఫుల్ ఆన్సర్

తాజాగా తన ట్యాగ్ విషయంపై సుధీర్ బాబు స్పందించారు. తన అప్ కమింగ్ మూవీ మా నాన్న సూపర్ హీరో ప్రెస్ మీట్ లో రెస్పాండ్ అయ్యారు.

Update: 2024-10-10 08:15 GMT

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు.. తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యమైన ప్రాజెక్టులు ఎంచుకుంటూ సినీ ప్రియులను అలరిస్తున్నారు. రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. 2024లో ఇప్పటికే హరోం హర మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తనలోని మాస్ యాంగిల్ ను ఆడియన్స్ కు పరిచయం చేసి మెప్పించారు.

అయితే ఆ సినిమా టైటిల్స్ లో సుధీర్ బాబు పేరు ముందు నవ దళపతి ట్యాగ్ ను యాడ్ చేశారు మేకర్స్. అప్పటి నుంచి ఆయనను సినీ ప్రియులు, ఫ్యాన్స్.. నవ దళపతి ట్యాగ్ తోనే పిలుస్తున్నారు. తాజాగా తన ట్యాగ్ విషయంపై సుధీర్ బాబు స్పందించారు. తన అప్ కమింగ్ మూవీ మా నాన్న సూపర్ హీరో ప్రెస్ మీట్ లో రెస్పాండ్ అయ్యారు. తనకు ఏ పేరుతో ఎప్పుడు ఎలా పిలిచినా ఓకే అని తెలిపారు సుధీర్ బాబు.

"నా గత సినిమా హరోం హర దర్శకుడు.. షూటింగ్ అంతా పూర్తి అయిన తర్వాత నాకు ఓ విషయం తెలిపారు. మూవీ టైటిల్స్ లో నా పేరు ముందు నవ దళపతి ట్యాగ్ ను పెడుతున్నట్లు చెప్పారు. నాకు ఇష్టం అయితే అదే కంటిన్యూ చేయండని ఆయన అన్నారు. కాబట్టి నాపై అభిమానంతో వారు ఇచ్చిన ట్యాగ్ ను ఎందుకు వద్దు అనుకోవాలనే ఆలోచనతో నవ దళపతి ట్యాగ్ ను కంటిన్యూ చేస్తున్నాను" అని సుధీర్ బాబు తెలిపారు.

తనకు ఎలా పిలిచినా, పేరు పెట్టి పిలిచినా, ట్యాగ్ పెట్టి పిలిచినా పర్వాలేదని సుధీర్ బాబు చెప్పారు. తాను నటించిన సినిమాలోని రోల్ పేరుతో పిలిచినా పలుకుతానని తెలిపారు. ఎవరి పిలుపు వాళ్ల ఇష్టమని అన్నారు. అందులో ఎలాంటి తప్పు లేదని తెలిపారు. అదే సమయంలో వందల కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన హీరోలు మాత్రమే ట్యాగ్‌ లు పెట్టుకోవాలని ఏమైనా రూల్ ఉందా అని సరదాగా క్వశ్చన్ చేశారు.

ఇక సుధీర్ బాబు సినిమాల విషయానికొస్తే.. ఆయన నటించిన మా నాన్న సూపర్ హీరో మూవీ మరికొద్ది గంటల్లో రిలీజ్ కానుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఆయన జటాధర మూవీ చేస్తున్నారు. అందుకు సంబంధించిన లుక్స్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. త్వరలో రాహుల్ రవీంద్రన్ తో ఓ సినిమా చేయనున్నారు. మరి సుధీర్ బాబు.. తన అప్ కమింగ్ చిత్రాలతో ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.

Tags:    

Similar News