తెలుగు తెరపై ఇలాంటి బ్యాక్‌డ్రాప్‌తో రాలేదు: సుధీర్ బాబు
తన సినిమా రాలేదు అనే గ్యాప్ ని ఫిల్ చేసేంతటి వాడిని కాను నేను.. కానీ నా వంతుగా వరుస సినిమాల్ని అందించే ప్రయత్నం చేస్తున్నాను.
ఇండస్ట్రీలో ఎందరు హీరోలున్నా మహేష్ నటించిన సినిమా వస్తే ఆ కిక్కే వేరు! అని అన్నారు హీరో సుధీర్ బాబు. ఆయన నటించిన హరోంహర ఈనెల 14న విడుదల కానుంది. తాజాగా ప్రీరిలీజ్ వేదికపై సుధీర్ బాబు పైవిధంగా స్పందించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ..``మహేష్ నుంచి సినిమా రావడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతోంది. తన సినిమా రాలేదు అనే గ్యాప్ ని ఫిల్ చేసేంతటి వాడిని కాను నేను.. కానీ నా వంతుగా వరుస సినిమాల్ని అందించే ప్రయత్నం చేస్తున్నాను. మహేష్ తో ఎవరినీ పోల్చలేను. ఆయన లెవల్లో ఫుల్ బాటిల్ కిక్ ఇవ్వలేను కానీ.. ఈలోగా చిన్న చిన్న ఫ్లిక్ లు ఇస్తాను.. మందు సిట్టింగుల్లో మా హీరోకి కూడా ఇలాంటి సినిమా పడాలి అని ఇతర హీరోల అభిమానులు కోరుకునే లాంటి సినిమా చేసాను!`` అని అన్నారు.
సుధీర్ బాబు ఇంకా చాలా విషయాలను మాట్లాడారు. సుధీర్ మాట్లాడుతూ-```నా కష్టాన్ని ప్రజలు చూస్తున్నారు. ఇంతవరకూ తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి బ్యాక్ డ్రాప్ తో ఏ సినిమా రాలేదు. అది నా గ్యారెంటీ. ట్రైలర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎలాంటి ఔట్ పుట్ ని ఇవ్వబోతున్నామో మీరు థియేటర్లలోనే చూడండి`` అని అన్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారు నా మావయ్య.. ఆయనే నా సూపర్ స్టార్. మావయ్యా మీరు కోరుకున్న సినిమా ఇది.. మీరు నన్ను ఎలాంటి పాత్రలో చూడాలనుకున్నారో అలాంటి పాత్రలో చేసాను. మీకు ఈ సినిమా చూపించలేకున్నాం. మీరు ఎక్కడ ఉన్నా చూస్తారనే ఆశిస్తున్నాను.. అని అన్నారు.
దర్శకుడు కథ నేరేట్ చేయడానికి వచ్చినప్పుడు లైటర్ వెయిన్ లవ్ స్టోరి చెబుతాడనుకుంటే, ఆయన తుపాకులు పట్టుకుని వచ్చాడు. అతడితో ప్రయాణించిన తొలి వారంలోనే అర్థమయ్యాడు. ఈ సినిమాని ఆయన అద్భుతంగా తీసాడు. నా పాత్ర కోసం.. సుబ్రమణ్యం అనే పాత్ర ఎలా ఉంటుంది? కొడితే ఎలా కొడతాడు? వంటి విషయాలు వారంలోనే అలవర్చుకున్నా. సుబ్రమణ్యం , సుమన్ ఈ చిత్రానికి నిర్మాతలు. కథ విలువను బట్టి వారు ఫుల్ గా బడ్జెట్ పెట్టారు. ఇండస్ట్రీలో బలమైన నిర్మాతలుగా వారు నిలుస్తారు. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ సహా టెక్నీషియన్లు అద్భుతంగా పని చేసారు. సినిమా చూసి వెళ్లే ప్రతి మగాడు సుబ్రమణ్యం ( నా పాత్ర) లా ఫీలవుతారు.. అంత బాగా మ్యూజిక్ ఇచ్చాడు చేతన్. కళాదర్శకుడు రాము సహా పలువురు అద్భుతమైన పనితనంతో ఆకట్టుకున్నారు. వారితో మళ్లీ పని చేస్తానని సుధీర్ బాబు అన్నారు.