హీరోయిన్ కాక ముందే స్టార్ కిడ్ తెలివైన పెట్టుబడి!
ముంబైకి సమీపంలోని సుందరమైన అలీబాగ్‌లోని థాల్ గ్రామంలో వ్యవసాయ భూమిని 9.5 కోట్లకు కొనుగోలు చేసింది సుహానా.
షారుక్ ఖాన్ కుమార్తె సుహానాఖాన్ 'ది అర్చీస్' తో బాలీవుడ్ లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఇక అమ్మడు హీరోయిన్ గా మ్యాకప్ వేసుకోవడమే ఆలస్యం. ఆ సమయం ఎప్పుడోస్తుందా? అని అభిమానులు ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. స్నేహితురాల ..కోస్టార్ ఖుషీ కపూర్ కూడా సీరియస్ గా మంతనాలు జరపడంతో? సుహానా కూడా సీరియస్ గానే ఫోకస్ చేస్తుంది. తండ్రి బ్యానర్ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్స్ లోనే డెబ్యూ చేయాలని ఆశపడుతుంది.
షారుక్ -గౌరీఖాన్ లు సైతం కుమార్తెని అదే బ్యానర్ లో లాంచ్ చేస్తే? బాగుంటుంది అన్న ఆలోచనలో ఉంది. మరోవైపు కరణ్ జోహార్ లాంటి బడా నిర్మాతలు నేను ఉన్నాను కదా? అంటూ ముందుకొస్తున్నా షారుకు తనయల విషయంలో ఓ క్లారిటీతో ముందుకెళ్తున్నారు. అందుకే ఆర్యన్ ఖాన్..సుహానా ఖాన్ విషయంలో ఇతర బ్యానర్ల ఆలోచన రానివ్వడం లేదు. ఇలా సుహానా బ్యాకెండ్ లో డాడ్ ఇంత గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు.
స్వీట్ డాటర్ సుహానా కూడా అంతే క్రమశిక్షణతోనూ కనిపిస్తుంది. సొంత డబ్బుతో అమ్మడు అప్పుడే ఓ వ్యవసాయ భూమినే కొనుగోలు చేసిన సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది. ముంబైకి సమీపంలోని సుందరమైన అలీబాగ్‌లోని థాల్ గ్రామంలో వ్యవసాయ భూమిని 9.5 కోట్లకు కొనుగోలు చేసింది సుహానా. మరి ఇంత డబ్బు తాను ఎలా సమకూర్చుంది అన్నది తెలియదుగానీ తెలివిగా పెట్టుబడి పెట్టింది అన్నది వాస్తవం.
హీరోయిన్ కాక ముందే...కోట్ల రూపాయలు పారితోషికం అందుకోక ముందే సుహానా ఇంత తెలివిగా పెట్టుబడి పెడుతుంది? అంటే హీరోయిన్ అయిన తర్వాత...కోట్ల రూపాయలు అడ్వాన్సులు అందుకుంటే ఇంకెంత జాగ్రత్త వహిస్తుంది అన్నది గెస్ చేయోచ్చు. సంపాదనలో అమ్మ-నాన్నలనే మించిపోతుంది. షారుక్ కన్నా...గౌరీ ఖాన్ వార్షిక ఆదాయం ఎక్కువ. మరి సంపాదన విషయంలో సుహానా ఎవర్నీ పొలుతుందో చూడాలి.