ఆలియా పెళ్లి చీర తిరిగి ధ‌రించ‌డంపై సుహానా

అలియా నిర్ణయాన్ని 'అద్భుతం' అని కొనియాడింది. ఇది చాలా అవసరమైన సందేశం! అని పేర్కొంది.

Update: 2023-11-29 04:59 GMT

కింగ్ ఖాన్ న‌ట‌వార‌సురాలు సుహానా ఖాన్ తండ్రి లెగ‌సీని ముందుకు న‌డిపించేందుకు తెర‌పైకి దూసుకొస్తోంది. ది ఆర్చీస్‌తో న‌టిగా తెర‌కు ప‌రిచ‌య‌మ‌వుతోంది. జోయా అక్తర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా(ఓటీటీ సిరీస్) ప్ర‌చారంలో సుహానా పూర్తి బిజీగా ఉంది. ఇటీవలి ప్రచార కార్యక్రమంలో సుహానా మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ప్రారంభంలో జాతీయ అవార్డుల కోసం తన వివాహ చీరను తిరిగి ధరించినందుకు అలియా భట్‌ను ప్రశంసించింది. అలియా నిర్ణయాన్ని 'అద్భుతం' అని కొనియాడింది. ఇది చాలా అవసరమైన సందేశం! అని పేర్కొంది.

``జాతీయ అవార్డుల కోసం అలియా తన పెళ్లి చీరను మళ్లీ ధరించింది. సెల‌బ్రిటీగా ఒక వేదిక‌ ఉన్న వ్యక్తిగా, ప్రభావం ఉన్న వ్యక్తిగా ఇలా చేయ‌డం స‌రైన‌ద‌ని నేను భావిస్తున్నాను. ఇది నమ్మశక్యం కానిది.. చాలా అవసరమైన సందేశం అని నేను భావించాను`` అని సుహానా చెప్పింది. ఆలియా స్థిరత్వం వైపు ఒక స్టాండ్ తీసుకుంది. అలియా భట్ తన పెళ్లి చీరను తిరిగి ధరించినందున‌.. మేం పార్టీ కోసం దుస్తులను పునరావృతం చేయవచ్చు... అని వ్యాఖ్యానించింది.

గంగూబాయి కతియావాడి సినిమాలో తన నటనకు గానూ అలియా భట్ ఉత్తమ నటిగా జాతీయ అవార్డును కూడా అందుకుంది. 2021లో వచ్చిన తన చిత్రం మిమికి గాను కృతి సనన్‌తో జాతీయ‌ అవార్డును షేర్ చేసుకుంది. అలియా 2022లో రణబీర్ కపూర్‌తో తన వివాహం కోసం సబ్యసాచి ముఖర్జీ రూపొందించిన చక్కటి టిల్లా వర్క్‌తో ఎంబ్రాయిడరీ చేసిన ఐవరీ ఆర్గాన్జా చీరను ధరించింది. తర్వాత, అలియా భట్ తన పెళ్లి చీరను ఎందుకు తిరిగి ధరించాలని నిర్ణయించుకుందో కూడా వెల్లడించింది. ఎప్పుడైతే పెద్ద ఈవెంట్ లేదా పెద్ద ముహూర్తం రాబోతుందో దాని కోసం ఇలా చేయాల‌నుకున్నాను. నాకు ఇది సహజంగానే అనిపించింది`` అని అన్నారు. ఒక‌ ప్రత్యేక సందర్భం కోసం ప్రత్యేక దుస్తులను ఒకటి కంటే ఎక్కువసార్లు ధరించవచ్చు అని ఆలియా పేర్కొన్నారు.

Tags:    

Similar News