సుహాస్ ప్రేమకథకు హరీష్ శంకర్ హెల్ప్..!

ఓ భామ అయ్యో రామ కూడా సుహాస్ మార్క్ సినిమాలానే ప్రేమ కథతో పాటు ఎంటర్టైనింగ్ కూడా ఉంటుందని తెలుస్తుంది.

Update: 2025-02-21 12:38 GMT

యువ హీరో సుహాస్ ప్రేమకథకు డైరెక్టర్ హరీష్ శంకర్ హెల్ప్ చేస్తున్నారట. అదేంటి ఆల్రెడీ సుహాస్ కి పెళ్లై పిల్లలు కూడా ఉన్నారుగా ఇప్పుడు కొత్తగా లవ్ స్టోరీ ఏంటి మళ్లీ దానికి దర్శకుడు హరీష్ శంకర్ సపోర్ట్ చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు కదా ఇది రియల్ లైఫ్ లవ్ స్టోరీ కాదు రీల్ లైఫ్ లవ్ స్టోరీ. యంగ్ హీరోల్లో తన మార్క్ సినిమాలు చేస్తూ రాణిస్తున్న సుహాస్ మరో సరికొత్త ప్రేమకథతో రాబోతున్నాడు. ఈ సినిమాను రామ్ గోధల డైరెక్ట్ చేస్తున్నాడు.

V ఆర్ట్స్ బ్యానర్ లో హరీష్ నల్ల ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఓ భామ అయ్యో రామ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో మలయాళ భామ మాళవిక మనోజ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఒక గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్నారట. రీసెంట్ గానే సినిమాలో హరీష్ శంకర్ కి సంబంధించిన సీన్స్ షూట్ పూర్తి చేశారట. ఆ సీన్స్ చాలా బాగా వచ్చాయని టాక్.

సుహాస్ నుంచి ఆడియన్స్ ఆశించే ఎంటర్టైనింగ్ తో పాటు ఈ సినిమా ఒక మంచి లవ్ స్టోరీగా వస్తుందని తెలుస్తుంది. సినిమా కథ ఎంత బాగుంటే హరీష్ శంకర్ లాంటి డైరెక్టర్ భాగం అవుతారు చెప్పండి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మంచి కథ ఎంచుకుని దానికి తన మార్క్ ఫన్ అందిస్తూ ఆడియన్స్ నుంచి పాపులారిటీ తెచ్చుకుంటున్నాడు సుహాస్.

ఓ భామ అయ్యో రామ కూడా సుహాస్ మార్క్ సినిమాలానే ప్రేమ కథతో పాటు ఎంటర్టైనింగ్ కూడా ఉంటుందని తెలుస్తుంది. సినిమా రిలీజ్ ఎప్పుడన్నది తెలియదు కానీ ఎప్పొడొచ్చినా కూడా సినిమా ప్రేక్షకులను అలరించడంలో డౌట్ పడాల్సిన అవసరం లేదని అంటున్నారు. సుహాస్ సినిమాలో హరీష్ శంకర్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాడని చెప్పొచ్చు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుంది అన్నది చూడాలి. సుహాస్ సినిమాలు లిమిటెడ్ బడ్జెట్ తో తెరకెక్కిస్తారు. అతని సినిమాలన్నీ కూడా మినిమం గ్యారెంటీ హిట్లు గా నిలుస్తున్నాయి. రాబోతున్న ఓ భామ అయ్యో రామ సినిమా కూడా సేఫ్ ప్రాజెక్ట్ అవుతుందా లేదా అన్నది రిలీజ్ తర్వాత తెలుస్తుంది.

Tags:    

Similar News