హీరోయిన్ల పై సుహాసిని సంచలన వ్యాఖ్యలు!
స్టోరీ డిమాండ్ మేరకు హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యత అన్నది ఇప్పుడిప్పుడు పెరుగుతుంది.
సినిమాల్లో హీరోయిన్ల పాత్రలనేవి కొంత వరకే పరిమితం. మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ లో ఎప్పుడూ హీరోల పాత్రలే హైలైట్ అవుతుంటాయి. హీరో ఇమేజ్ పైనే సినిమా నడుస్తుంది కాబట్టి హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. నాలుగు పాటలు...రొమాంటిక్ సన్నివేశాలకే పరిమితైన హీరోయిన్లను మునుపటి కంటే ఇప్పుడు కాస్త మెరుగ్గా చూపిస్తున్నారు. స్టోరీ డిమాండ్ మేరకు హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యత అన్నది ఇప్పుడిప్పుడు పెరుగుతుంది.
ఎంత పెరిగినా హీరో తో పోటీపడే పాత్రలైతే రావు అన్నది వాస్తవం. ఈనేపథ్యంలో తాజాగా హీరోయిన్లను ఉద్దేశించి సీనియర్ నటి సుహాసిని సంచనల వ్యాఖ్యలు చేసారు. `పాశ్చత్య పోకడలను అవలంభించడం ఎక్కువైంది. దీంతో స్కిన్ షో, ఇంటిమేట్ సీన్లలో నటించడానికి హీరోయిన్లు ఇబ్బంది పడటం లేదు. గతంలో ఇలాంటి సీన్లు చేయాలంటే చాలా ఆలోచించేవారు. అవి చేసే వాళ్లు చాలా అరుదుగా ఉండేవారు. కానీ ఇప్పుడలా కాదు. ఎలా ఉన్నా? సన్నివేశంలో నటించడానికి రెడీగా ఉన్నారు.
భావ ప్రకటన పేరుతో మహిళల పాత్రల్ని తక్కువ చేసి చూపిస్తున్నారు. హీరోలకు బలమైన పాత్రలు రాస్తున్నారు, కానీ హీరోయిన్ల పాత్రలకు మాత్రం ప్రాధాన్యత ఉండటం లేదు` అని అన్నారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. సుహాసిని ఇంతవరకూ హీరోయిన్లను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు ఎక్కడా చేయలేదు. తొలిసారి హీరోయిన్ల తీరును, పాత్రల విషయంలో వాళ్లకు జరుగుతోన్న అన్యాయంపై మాట్లాడటం ఆసక్తికరంగా మారింది.
అలాగే భర్త మణిరత్నం గురించి సుహాని మాట్లాడారు. తమది పెద్దలు కుదిర్చిన వివాహం అని, ఇష్టాలు, అభిప్రాయాలు, వృత్తి ఇలా ప్రతీ విషయంలోనూ ఒకర్ని ఒకరు గౌరవించుకుంటామన్నారు. తమ మధ్య ఎప్పుడూ గొడవలు జరగవన్నారు. మనస్పర్దలొచ్చినా వెంటనే సర్దుకుపోతామన్నారు.