గ‌న్ తో ఆక‌తాయిల్ని బెదిరించిన చిరంజీవి!

స్టార్ హీరోలు రీల్ మీద‌నే కాదు అప్పుడ‌ప్పుడు రియ‌ల్ లైఫ్ లోని హీరోలు అని ప్రూవ్ చేస్తుంటారు.

Update: 2024-09-18 07:01 GMT

స్టార్ హీరోలు రీల్ మీద‌నే కాదు అప్పుడ‌ప్పుడు రియ‌ల్ లైఫ్ లోని హీరోలు అని ప్రూవ్ చేస్తుంటారు. చేస్తున్న స‌హాయాల రూపంలో కావొచ్చు..అందిస్తోన్న విరాళాల రూపంలో కావొచ్చు...ఒక‌రిని కాపాడే విష‌యంలో కావొచ్చు. ఇలా రియ‌ల్ లైఫ్ లో హీరోలు హైలైట్ అవుతుంటే? నిజంగానే వాళ్లు హీరోలు అనిపిస్తుంది. తాజాగా చిరంజీవి త‌న పాలిట రియ‌ల్ హీరో అనేసారు అందాల న‌టి సుహాసిని.

చిరు న‌టించిన హీరోయిన్లు సుహాసిని కూడా ఒక‌రు. 1980-90 ద‌శ‌కంలో ఇద్ద‌రి కాంబినేష‌న్ లో చాలా సినిమాలొచ్చాయి. తాజాగా చిరును ప్ర‌శంసించిన వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతోంది. అందులో ఆమె మాట్లాడుతూ.. `చిరంజీవి నా హీరో. అంద‌రికీ ఓ విష‌యం చెప్పాల‌నుకుంటున్నా. ఓ సారి షూటింగ్ కోసం కేర‌ళ‌లోని ఓ ప్రాంతానికి వెళ్లాం. ముందు కారులో చిరంజీవి వెళ్తున్నారు. వెనుక కారులో నేను డాన్సు మాస్ట‌ర్, హెయిర్ డ్రెస్స‌ర్ ఉన్నాం.

అనుకోకుండా ఆ స‌మ‌యంలో కొంద‌రు తాగుబోతులు మ‌మ్మ‌ల్ని వెంబ‌డించారు. కారుపై తాగేసిన బీరు బాటిల్స్ విసిరారు. అది చూసిన చిరంజీవి వెంట‌నే కారు దిగి వాళ్ల‌ను గ‌న్ తో బెదిరించారు. దీంతో వాళ్లంతా పారిపోయారు. హీరోయిజ్ అంటే కెమెరా ముందే కాదు. రియ‌ల్ లైఫ్ లో కూడా అలానే ఉండ‌టం. ఈ సంఘ‌ట‌న మీకు గుర్తుందా? అని చిరంజీవిని అడిగారు. దానికి చిరంజీవి స్పందిస్తూ అవును గుర్తుంది.

వాళ్లు మిమ్మ‌ల్ని వెంబ‌డించ‌న‌డం అనూహ్య ప‌రిణామం` అని అన్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది. మెగా అభిమానులు అది విని చిరంజీవి ఇంత‌టి దైర్య‌శాలినా? అంటూ పొగిడేస్తున్నారు గ‌తంలో విజ‌య‌శాంతి కూడా చిరంజీవి నా హీరో అంటూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. అలాగే రాధిక‌, రాధ‌లు సైతం చిరంజీవి తో న‌టించిన అనుభ‌వాన్ని ప‌లు సంద‌ర్భాల్లో గుర్తు చేసుకున్నారు.

Tags:    

Similar News