సుహాస్.. రెండు నెలల్లో నాలుగా?

గత ఏడాది రైటర్ పద్మభూషణ్ మూవీతో మంచి హిట్ అందుకున్న సుహాస్.. రీసెంట్ గా అంబాజీ మ్యారేజీ బ్యాండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు

Update: 2024-03-20 17:30 GMT

సుహాస్.. వెబ్ సిరీసులు, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఫేమస్ అయ్యి హీరోగా మారిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో సుహాస్ సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ హిట్ అని ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నారు. ఓ మూవీ సెట్స్ పై ఉండగానే.. మరో సినిమా ప్రకటించేస్తున్నారు. వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ, షూటింగ్స్ లో పాల్గొంటూ బిజీగా గడుపుతున్నారు.

గత ఏడాది రైటర్ పద్మభూషణ్ మూవీతో మంచి హిట్ అందుకున్న సుహాస్.. రీసెంట్ గా అంబాజీ మ్యారేజీ బ్యాండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీతో మరో డీసెంట్ సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఈ కుర్ర హీరో లైనప్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఫుల్ బిజీ షెడ్యూల్స్ తో యంగ్ హీరో డైరీ అసలు ఖాళీ లేకుండా ఉంటోంది. ఇప్పుడు రెండు నెలల్లో నాలుగు చిత్రాలతో థియేటర్లలోకి రానున్నారు.

సమ్మర్ కానుకగా సుహాస్ నటించిన శ్రీరంగనీతులు, ప్రసన్న వదనం, ప్రొడక్షన్ నెం.4, కేబుల్ రెడ్డి సినిమాలు రిలీజ్ అవ్వనున్నాయి. టాలీవుడ్ యువ నటులు కార్తీక్ రత్నం, విరాజ్ అశ్విన్ తో సుహాస్ చేస్తున్న శ్రీరంగ నీతులు సినిమా ఏప్రిల్ 12వ తేదీన రిలీజ్ అవ్వనుంది. ప్రసన్నవదనం మూవీలో వింత వ్యాధితో బాధపడుతున్న రోల్ లో నటిస్తున్నారు సుహాస్. ఈ సినిమా కూడా వేసవిలోనే విడుదల కానుంది.

మరోవైపు, ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో సుహాస్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గతేడాది షూటింగ్ స్టార్ట్ అవ్వగా.. ఇటీవల మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించారు. మే 24వ తేదీన విడుదల కానుందీ చిత్రం. త్వరలోనే టైటిల్ ను అనౌన్స్ చేయనున్నారు. ఇక తన స్నేహితుడి శ్రీధర్ డైరెక్షన్ లో కేబుల్ రెడ్డి మూవీని కూడా గతేడాది స్టార్ట్ చేశారు సుహాస్. ఈ సినిమా కూడా వేసవిలోనే విడుదలవుతున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి వేసవి అంటే దాదాపు రెండు నెలల్లో నాలుగు సినిమాలతో రానున్నారు సుహాస్. దీంతో ఈ హీరో స్పీడ్ పై నెట్టింట చర్చ నడుస్తోంది. మరీ అంత స్పీడా అని మాట్లాడుకుంటున్నారు. కష్టపడి పైకొచ్చిన హీరోనేనని, కానీ కాస్త నెమ్మదిగా సినిమాలు చేస్తే బెటర్ అని అంటున్నారు. కంటిన్యూగా సినిమాలు రిలీజ్ చేస్తే ఆడియన్స్ కు బోర్ కొడుతుందని తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే టాలీవుడ్ మరో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసి బోర్ కొట్టించి డిజాస్టర్ అందుకున్నారని గుర్తు చేస్తున్నారు. అందుకే మరో యువ నటుడు నవీన్ పొలిశెట్టిలా ఆలోచించి డిఫరెంట్ కంటెంట్ ఉన్న చిత్రాలతో వస్తే సరిపోతుందని చెబుతున్నారు. దండయాత్ర మాదిరిగా విసుగు తెప్పించకూడదని సూచిస్తున్నారు. మరి సుహాస్ తన కొత్త చిత్రాల రిలీజ్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News