స్టార్‌ నిర్మాతపై ఆత్మహత్య యత్నం కేసు!

తన తల్లి ఆత్మహత్య యత్నం కు కారణం నిర్మాత జ్ఞానవేల్ రాజా మరియు ఆయన భార్య నేహా అంటూ లక్ష్మి కూతురు ఫిర్యాదు చేసింది.

Update: 2024-04-27 04:21 GMT

కోలీవుడ్‌ తో పాటు అన్ని భాషల్లో కూడా సినిమాలు నిర్మించిన నిర్మాత జ్ఞానవేల్‌ రాజా అందరికి సుపరిచితుడు. తమిళ స్టార్‌ హీరోలు సూర్య మరియు కార్తి కి సన్నిహితుడిగా పేరు దక్కించుకున్న ఈ నిర్మాత పై కేసు నమోదు అయ్యింది. ఆయనతో పాటు ఆయన భార్య నేహా పై కూడా కేసు నమోదు అవ్వడం చర్చనీయాంశం అయ్యింది.

కేసు పూర్తి వివరాల్లోకి వెళ్తే... కొన్ని రోజుల క్రితం జ్ఞానవేల్ రాజా ఇంట్లో దొంగతనం జరిగింది. పెద్ద మొత్తంలో నగలు మాయం అవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన జ్ఞానవేల్‌ రాజా కుటుంబ సభ్యులు తమకు పని మనిషి లక్ష్మి తీసినట్లుగా అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

దొంగతనం కేసు నమోదు చేసిన పోలీసులు లక్ష్మి ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. పోలీసుల విచారణ ఎదుర్కొన్న లక్ష్మి మనస్థాపానికి గురై ఆత్మహత్య యత్నం చేసింది. తన తల్లి ఆత్మహత్య యత్నం కు కారణం నిర్మాత జ్ఞానవేల్ రాజా మరియు ఆయన భార్య నేహా అంటూ లక్ష్మి కూతురు ఫిర్యాదు చేసింది.

విచారణ పేరుతో తన తల్లిని చిత్రహింసలకు గురి చేశారని, జ్ఞానవేల్‌ రాజా మరియు నేహా లు చాలా అవమానకరంగా తన తల్లితో మాట్లాడారు అంటూ ఫిర్యాదులో పేర్కొన్న లక్ష్మి కుమార్తే తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తుంది.

ఇరు వైపుల కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం ఎంక్వరీ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ కేసు విషయమై ఇప్పటి వరకు జ్ఞానవేల్‌ రాజా టీం మెంబర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన కానీ, ప్రెస్ నోట్‌ కానీ రాలేదు.

Tags:    

Similar News