'ఓజీ' సినిమాలో బోయపాటి రేంజ్ సీనా?
తాజాగా 'ఓజీ' సినిమాలో యంగ్ డైరెక్టర్ సుజిత్ కూడా బోయపాటి రేంజ్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ఒకటి ప్లాన్ చేస్తున్నాడన్న విషయం లీకైంది.
బోయపాటి సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు ఎలా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమాల్లో యాక్షన్ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. భారీ యాక్షన్ సీక్వెన్స్ కి పెట్టింది పేరు బోయపాటి. బలమైన యాక్షన్ షాట్స్ తీయడంలో? బోయపాటి వెరీ స్పెషల్. నటసింహ బాలయ్యకు కొత్త ఇమేజ్ ను తీసుకురావడంలో బోయపాటి సక్సెస్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి సైతం ఆయనతో సినిమా చేయాలని ఆశపడుతున్నారంటే? బోయపాటి ప్రత్యేకత ఏంటి అన్నది అద్దం పడుతుంది.
తాజాగా 'ఓజీ' సినిమాలో యంగ్ డైరెక్టర్ సుజిత్ కూడా బోయపాటి రేంజ్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ఒకటి ప్లాన్ చేస్తున్నాడన్న విషయం లీకైంది. సాధారణంగా సుజిత్ సినిమాల్లో యాక్షన్ అంటూ హీరో-విలన్ గ్యాంగ్ తుపాకులతో కాల్చుకోవడం ఉంటుంది. బైక్ , కారు ఛేజింగ్ సన్నివేశాలుంటాయి. 'సాహో'లో తనలో యాక్షన్ కొణాన్ని అలాగే హైలైట్ చేసాడు సుజిత్.
అయితే 'ఓజీ' గ్యాంగ్ స్టార్ సినిమా అయినప్పటికీ గన్ ఫైరింగ్స్ ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఓ 300 మందిపై దాడి చేసేలా ఓ యాక్షన్ సీన్ ఉందిట. ఇది ముంబైలో ప్రత్యేకంగా వేసిన ఓసెట్లో షూట్ చేస్తారని తెలిసింది. ఇదే నిజమైతే పవన్ యాక్షన్ కెరీర్ లో ఇదో చరిత్ర అవుతుంది. ఎందుకంటే ఆయన ఇంతవరకూ 300 మందితో ఎప్పుడూ ఫైట్ చేయలేదు. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో 'బాలు',' పంజా' లాంటి సినిమాలు చేసారు.
కానీ ఒక్క సీన్ కోసం ఎందులోనూ 300 మంది ఫైటర్లను రంగంలోకి దించలేదు. తొలిసారి 'ఓజీ' కోసం సుజిత్ అంత మంది ఫైటర్లను రంగలోకి దించి పెద్ద ఎత్తున యాక్షన్ సీన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాకే ఈ సీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పొచ్చు. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలి.