రాజేష్ ని చూసి సుకుమార్ స్టైల్ మార్చేస్తారా?

కానీ ఆ భ‌యం తొల‌గిపోయింది. ఇక‌పై నా ర‌చ‌నా శైలి మారిపోతుంది చూడు' అన్నారు.

Update: 2023-07-20 07:28 GMT

ఇటీవ‌ల రిలీజ్ అయిన 'బేబి' మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. సాయి రాజేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా క‌మ‌ర్శియ‌ల్ గా మంచి వ‌సూళ్లుని సాధిస్తోంది. యువ‌తికి కావాల్సిన స్ట‌ప్ అంతా సినిమాలో పుష్క‌లంగా ఉండ‌టంతో థియేట‌ర్లన్నీ ఫుల్ అవుతున్నాయి. దీంతో ద‌ర్శ‌కుడిగా రాజేష్ పేరు ఇండ‌స్ట్రీలో జోరందుకుంది. అంత‌కుముందు రెండు..మూడు సినిమాలు చేసినా ఏ సినిమా తీసుకురాని ఐడెంటిటీ 'బేబి' తీసుకొచ్చింది. అగ్ర ద‌ర్శ‌కులు ఫోన్ చేసి రాజేష్ ప‌నిత‌న్నా ప్ర‌శంశిస్తున్నారు.

అందులో పాన్ ఇండియా మేక‌ర్ సుకుమార్ కూడా ఉన్నారు. లెక్క‌లు మాష్టారైతే రాజేష్ ప‌నిత‌నాన్ని ఏకంగా ఆకాశానికే ఎత్తేసారు. ఆయ‌న రైటింగ్ స్టైల్ ని ఉద్దేశించి సుకుమార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు రాజేష్ మాట‌ల్ని బ‌ట్టి తెలుస్తోంది. అవేంటో సాయి రాజేష్ మాట‌ల్లోనే తెలుసుకుందాం. 'మా సినిమాపై సామాజిక మాధ్య‌మాల్లో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. కొంత మంది ఫోన్ చేసి అభినందిస్తున్నారు.

సుకుమార్ నిన్న సినిమా చూసారు. కొద్ది సేప‌టి కింద‌టే కాల్ చేసి ఫోన్ లోనే ముద్దు పోట్టేస్తున్నారు. ఇలా రాస్తే ఎలా స్వీక‌రిస్తారో అనుకునే వాడిని. కానీ ఆ భ‌యం తొల‌గిపోయింది. ఇక‌పై నా ర‌చ‌నా శైలి మారిపోతుంది చూడు' అన్నారు.'జీనియ‌స్ ద‌ర్శ‌కుడు అలా ప్ర‌శంసిస్తే మాట‌లు రాలేదు. అస‌లు విజ‌యం సాధించిన అనుభూతి ఆ క్ష‌ణ‌మే క‌లిగింది. ప్ర‌ధాన పాత్ర‌లు సైకాల‌జీ ఆధారంగా సాగే సినిమా ఇది.

'హృద‌య కాలేయం బౌండెడ్ స్క్ట్రిప్ట్ తో చేసా. కానీ ఈ సినిమాకి ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఏ రోజుకారోజు పాత్ర‌ల్ని గుర్తు చేసుకుంటూ రాసేవాడిని' అన్నారు రాజేష్. ఇక సుకుమార్ వ్యాఖ్య‌ల్ని చూస్తే ఓ స్టార్ డైరెక్ట‌ర్ ఇలా వ్యాఖ్యానించ‌డం గ్రేట్ అనే అనాలి. చిన్న సినిమాలు చేసుకునే సాయి రాజేష్ కిది అత‌ని కెరీర్ లోనే అతి పెద్ద ప్ర‌శంస‌.

అయితే సుకుమార్ ఈ త‌ర‌హా కంటెంట్ కి ఈజీగా క‌నెక్ట్ అవ్వ‌డానికి ఓ కార‌ణం ఉంది. ఈ జాన‌ర్లో ఆయ‌న 'కుమారి 21 ఎఫ్' అనే సినిమాకి రచ‌న చేసారు. అందులో యూత్ కి క‌నెక్ట్ అయ్యే అంశాలున్నాయి. ఆ ర‌కంగా రాజేష్ స్టోరీకి సుకుమార్ వ్య‌క్తిగ‌తంగా క‌నెక్ట్ అయ్యార‌ని చెప్పొచ్చు.

Tags:    

Similar News