రష్మిక 'గర్ల్ ఫ్రెండ్'.. ప్రతీ ఫ్రేమ్ సూపర్ అంటగా!

నిన్న పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గర్ల్ ఫ్రెండ్ టీజర్ కోసం మాట్లాడారు. పుష్ప-2లో రష్మిక శ్రీవల్లి 2.0గా అలరించేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే.

Update: 2024-12-03 09:21 GMT

బ్లాక్ బస్టర్ హిట్ మూవీ పుష్పతో హీరోయిన్ రష్మిక మందన్న నేషనల్ క్రష్ గా మారిపోయిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. తన అప్ కమింగ్ మూవీస్ వైపు అందరి దృష్టిని తిప్పుకున్నారు. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ హిట్ యానిమల్ మూవీతో తన క్రేజ్ ను మరింత పెంచుకున్నారు.

ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు రష్మిక. వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. ఓ వైపు పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో నటిస్తూనే.. మరోవైపు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాల్లో యాక్ట్ చేస్తున్నారు. ఆ కోవకు చెందిన గర్ల్ ఫ్రెండ్ మూవీ.. ఆమె లైనప్ లో ఉన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ యాక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే ఆ సినిమా టీజర్ ను కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చినా మేకర్స్ విడుదల చేయలేదు. దీంతో అంతా టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు. అదే సమయంలో జీనియస్ డైరెక్టర్ సుకుమార్.. నిన్న పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గర్ల్ ఫ్రెండ్ టీజర్ కోసం మాట్లాడారు. పుష్ప-2లో రష్మిక శ్రీవల్లి 2.0గా అలరించేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే.

పుష్ప ఈవెంట్ లో రష్మిక టాలెంట్ ను ప్రస్తావించారు. పుష్ప ఫైనల్ అవుట్ పుట్ కట్ చేస్తున్నప్పుడు ఆమె క్లోజప్ షాట్స్ చూసి అలా ఉండిపోయానని చెప్పారు. తన ఎక్స్ ప్రెషన్స్ అంత బాగుంటాయని అన్నారు. అదే సమయంలో రీసెంట్ గా గర్ల్ ఫ్రెండ్ టీజర్ చూశానని తెలిపారు. రాహుల్ చూపించారని, చాలా బాగుందని చెప్పారు. అన్నీ క్లోజప్ షాట్సేనని తెలిపి అంచనాలు పెంచారు.

అప్పుడే మంచి పిల్లను పట్టుకున్నావయ్యా రాహుల్ అని ప్రశంసించినట్లు తెలిపారు. ఆ సమయంలో రష్మిక.. థ్యాంక్యూ సుక్కూ అంటూ హగ్ సింబల్ ఇచ్చారు. మొత్తానికి సుకుమార్ కామెంట్స్ తో గర్ల్ ఫ్రెండ్ టీజర్.. ట్రెండింగ్ లో నిలిచింది. త్వరలోనే మేకర్స్ టీజర్ ను రిలీజ్ చేయనుండగా.. అప్పుడే ఆడియన్స్ లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

గర్ల్ ఫ్రెండ్ మూవీ టీజర్ కోసం వెయిటింగ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నిజానికి.. రష్మిక తన హావభావాలతో ఎప్పుడూ మెప్పిస్తారు.. ఆ విషయంలో ఆడియన్స్ కు ఎప్పుడో క్లారిటీ వచ్చేసింది.. ఇప్పుడు సుకుమార్ కామెంట్స్.. అదే సమయంలో లేడీ ఓరియెంటెడ్ మూవీ.. దీంతో రష్మిక అదరగొట్టేసి ఉంటారని అంతా ఫిక్స్ అయిపోయారు!

Tags:    

Similar News