ఆర్యనే కాదు జగడం కూడానా..?

ఆర్య హిట్ పడగానే కాస్త కాన్ఫిడెన్స్ ఎక్కువై ఆర్య నిర్మాత దిల్ రాజు చెబుతున్నా వినకుండా రామ్ తో ఆ సినిమా చేశాడు.

Update: 2024-12-04 14:21 GMT

ఐకాన్ స్టార్ సుకుమార్ ఈ కాంబో అంటే సినీ లవర్స్ కి పండగ అన్నట్టే లెక్క. ఆర్య తో మొదలైన ఈ కాంబో సెన్సేషన్స్ పుష్ప 1 తో పాన్ ఇండియా రేంజ్ కి పాకింది. ఇక పుష్ప 2 తో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఏర్పడింది. ఆర్య, ఆర్య 2, పుష్ప 1 ఇప్పుడు పుష్ప 2 సినిమా ఆడియన్స్ కు ఒక మ్యాడ్ నెస్ లాంటి ఎక్స్ పీరియన్స్ అందించేందుకు ఈ ఇద్దరు తమ బెస్ట్ ఇచ్చేస్తున్నారు. ఐతే ఆర్య తో హిట్ అందుకున్న సుకుమార్ ఆ నెక్స్ట్ సినిమా రామ్ తో జగడం తీశాడు. ఆర్య హిట్ పడగానే కాస్త కాన్ఫిడెన్స్ ఎక్కువై ఆర్య నిర్మాత దిల్ రాజు చెబుతున్నా వినకుండా రామ్ తో ఆ సినిమా చేశాడు.

జగడం సినిమా కథ సుకుమార్ అల్లు అర్జున్ కోసమే రాశాడట. ఐతే ఆ సినిమాకు అతను కాకపోతే మహేష్ తో అయినా చేయాలని అనుకున్నాడట సుక్కు. కానీ దిల్ రాజు కథలో కొన్ని మార్పులు సూచించడం వల్ల అది నచ్చని సుకుమార్ సినిమాను రామ్ తో మొదలు పెట్టి ముహూర్తానికి దిల్ రాజుని పిలిచాడు. ఆ తర్వాత జగడం రిజల్ట్ చూసిన తర్వాత దిల్ రాజు చెప్పిన మాట వినాల్సిందని అనుకున్నారట సుకుమార్.

అల్లు అర్జున్ లేదా మహేష్ ఈ ఇద్దరిలో ఎవరితో ఒకరితో చేస్తే కచ్చితంగా ఫలితం వేరేలా ఉండేదని అనుకున్నారట. ఐతే సుకుమార్ పుష్ప 1 తో అల్లు అర్జున్ కెరీర్ లోనే కాదు తన కెరీర్ లో కూడా మర్చిపోలేని సక్సెస్ అందుకున్నారు. పుష్ప 2 కి కూడా అదే రేంజ్ బజ్ వచ్చింది. మరికొద్ది గంటల్లో పుష్ప 2 ఫస్ట్ షో టాక్ రాబోతుంది. సినిమా ఎలా ఉంటుందో అని ఆడియన్స్ చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

సుకుమార్ అల్లు అర్జున్ మరోసారి బాక్సాఫీస్ పై తమ పంజా విసురుతారా లేదా అన్నది చూడాలి. పుష్ప 1 తో నేషనల్ అవార్డ్ కూడా దక్కించుకున్న అల్లు అర్జున్ పార్ట్ 2 తో ఎలాంటి హంగామా చేస్తాడన్నది చూడాలి. పుష్ప 2 బజ్ చూస్తుంటే నెవర్ బిఫోర్ రికార్డులను క్రియేట్ చేసేలా ఉంది. ఈ సినిమాతో మరోసారి తమ కాంబినేషన్ సత్తా ఏంటో చూపించబోతున్నారు.

Tags:    

Similar News