ఈ గ్యాప్‌లో సుక్కూ వ్వాటే ప్లాన్
అయితే ఇంత గ్యాప్ లో సుకుమార్ ఇక వేరే చిత్రాలకు పని చేయడా? అంటే ఎందుకు పని చేయడు?
'పుష్ప' ఫ్రాంఛైజీ కోసం ఏకంగా ఐదేళ్లు పని చేసాడు సుకుమార్. ఈ హార్డ్ వర్క్‌కి తగ్గ ప్రతిఫలం అందుకున్నాడు. రెండు సినిమాలకు కలుపుకుని రూ. 2,100 కోట్ల గ్రాస్ వసూలవ్వడం సంచలనం. అంత పెద్ద స్పాన్ ఉన్న సినిమా కోసం సుకుమార్ ఐదేళ్లు వెచ్చించడం తప్పు కాదు. తదుపరి సుకుమార్ మరో భారీ పాన్ ఇండియన్ చిత్రానికి దర్శకత్వం వహించాల్సి ఉంది. ఇందులో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. రంగ స్థలం తర్వాత మళ్లీ అదే జోడీ కలిసి పని చేస్తోంది అంటే ఈ సినిమాపై భారీ అంచనాలుంటాయి. అల్లు అర్జున్ ని పాన్ ఇండియన్ స్టార్ గా, జాతీయ ఉత్తమ నటుడిగా నిలబెట్టిన సుకుమార్ .. గేమ్ ఛేంజర్ తో ఫ్లాప్ ని అందుకున్న చరణ్ కి బిగ్ బ్రేక్ ని ఇవ్వాల్సి ఉంటుంది. అతడికి నటుడిగా మంచి పేరు తెచ్చే సినిమాని సుకుమార్ ఇవ్వాల్సి ఉంది. ఇలాంటి సమయంలో చరణ్ కోసం సుక్కూ ఎలాంటి స్క్రిప్టుని రెడీ చేస్తున్నాడు? అన్నది ఉత్కంఠను పెంచుతోంది.
ప్రస్తుతం చరణ్ సినిమా స్క్రిప్ట్ కోసం సుకుమార్ తీవ్రమైన కసరత్తు చేస్తున్నాడు. అయితే బౌండ్ స్క్రిప్ట్ రెడీ అవ్వడానికే చాలా సమయం తీసుకుంటుందని భావిస్తున్నారు. ఈ ఏడాది చివరి వరకూ సుకుమార్ స్క్రిప్టును ఫైనల్ చేస్తాడా లేదా? అన్నది వేచి చూడాలి. అయితే ఇంత గ్యాప్ లో సుకుమార్ ఇక వేరే చిత్రాలకు పని చేయడా? అంటే ఎందుకు పని చేయడు? సుకుమార్ రైటింగ్స్ లో అతడు వరుస చిత్రాలను తెరకెక్కించే ప్రణాళికలో ఉన్నాడు. నిర్మాతగా అతడు తన శిష్యులను ప్రమోట్ చేసుకునే పనిలో ఉన్నాడు. స్క్రిప్టుపై పని చేస్తూనే, అవసరమైన పెట్టుబడుల్ని సుకుమార్ రైటింగ్స్ సమకూరుస్తుంది.
ప్రస్తుతం సుకుమార్ రైటింగ్స్ లో రెండు సినిమాలను నిర్మించేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. అలాగే మధ్యలో ఆగిపోయిన దిల్ రాజు సోదరుని కుమారుడు ఆశిష్ రెడ్డి మూవీని తిరిగి పట్టాలెక్కించేందుకు సన్నాహకాల్లో ఉన్నారు. ఈ సినిమాని కూడా సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంలో నిర్మిస్తోంది. సుకుమార్ చాలా కాలంగా నిర్మాతగా యాక్టివ్ గానే ఉన్నారు. సుకుమార్ రైటింగ్స్ లో పలు విజయవంతమైన సినిమాలను అందించారు. ఇప్పుడు కూడా తన బ్యానర్ లో వరుస చిత్రాలను నిర్మిస్తున్నారు. దర్శకుడిగా మెగా ఫోన్ పట్టే లోపు తీరిక సమయాల్ని అతడు తెలివిగా సద్వినియోగం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. అదే సమయంలో ఇతరులకు మంచి అవకాశాల్ని కల్పిస్తున్నాడు.