పుష్ప 2 డైరెక్ట్ చేసింది సుకుమార్ కాదా..?
ఈ క్రమంలో తన అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీమాన్ గురించి సుకుమార్ స్పెషల్ గా ప్రస్తావించారు.
పుష్ప 1 సీక్వెల్ గా వచ్చిన పుష్ప 2 సినిమా రీసెంట్ గా రిలీజై బాక్సాఫీస్ దగ్గర రికార్డులు కొల్లగొడుతుంది. ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా మేకర్స్ సక్సెస్ ప్రెస్ మీట్ ఎరేంజ్ చేశారు. ఈ క్రమంలో పుష్ప 2 సినిమాకు పనిచేసిన తన టీం గురించి చెప్పాడు సుకుమార్. తన అసిస్టెంట్ డైరెక్టర్స్ ని స్టేజ్ మీదకు పిలిచి ఒక్కొక్కరి గురించి వారి సినిమాకు చేసిన వర్క్ గురించి చెప్పాడు సుకుమార్. ఈ క్రమంలో తన అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీమాన్ గురించి సుకుమార్ స్పెషల్ గా ప్రస్తావించారు.
పుష్ప 2 సినిమా సగం డైరెక్షన్ చేసింది శ్రీమానే అని అన్నారు. తనతో పనిచేసిన వీళ్లంతా కలిసి చేస్తేనే సినిమా అంత అందంగా వచ్చిందని అన్నారు. తాను ఎలా ఆలోచిస్తానో ఆ లెవెల్ నుంచి ఆలోచించే అసిస్టెంట్స్ ఉన్నారు. అందుకే తన టీం వల్లే ఇంత గొప్ప విజయం సాధ్యమైందని అన్నారు సుకుమార్. హిందీ వెర్షన్ ను తాను చూడకపోయినా సరే తన సహాయక దర్శకుడు వీరేందర్ సింగ్ షెఖావత్ మీద నమ్మకంతో అతని మీద వదిలేశానని అన్నారు సుకుమార్.
వీళ్లంతా కలిస్తేనే సుకుమార్.. సుకుమార్ అంటే ఒక్కడు కాదు.. ఇంతమంది సుకుమార్ లు కలిసి పనిచేస్తేనే సినిమా అవుతుందని అన్నారు. అంతేకాదు తన డైరెక్షన్ టీం గురించి మరో గొప్ప విషయాన్ని చెప్పారు సుకుమార్. వీళ్లలో ఎవరొచ్చి కథ చెప్పినా నిర్మాతలు మరో డౌట్ లేకుండా సినిమా చేయొచ్చని అన్నారు. సుకుమార్ లాంటి డైరెక్టర్ అలాంటి కామెంట్ చేయడం అతని దగ్గర పనిచేస్తున్న దర్శకులకు నిజంగా చాలా గొప్ప పుష్ ఇస్తుందని చెప్పొచ్చు.
సినిమాకు తాను ఎక్కువ రోజులు టైం తీసుకున్నా తాను అనుకున్న విధంగా సినిమా వచ్చేలా చేస్తాడు సుకుమార్. తనే కాదు తన అసిస్టెంట్ లను కూడా అంతే కష్టపెడుతుంటాడు. ఐతే సినిమా అవుట్ పుట్ చూశాక ఆ కష్టానికి ఫలితం ఇది అని సంతోషపడతాడు. ఐతే పాన్ ఇండియా హిట్ కొట్టిన డైరెక్టర్ ఇదంతా నా కష్టం నా సక్సెస్ అనకుండా తన టీం వల్లే ఈ సక్సెస్ అని చెప్పడంతో మరోసారి సుకుమార్ ఆడియన్స్ మనసులు గెలిచాడు. ఏది ఏమైనా సుకుమార్ సినిమా అంటే సూపర్ హిట్ పక్కా అనే ట్రేడ్ మార్క్ సెట్ చేసుకున్నాడు. పుష్ప 2 పూర్తైంది పుష్ప 3 అనౌన్స్ చేశారు కానీ అంతకుముందు చరణ్ తో సినిమా ఉంటుందని తెలుస్తుంది.