అఫీషియల్.. 'గేమ్ ఛేంజర్' మెగా ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ ఎవరంటే?
గతంలో సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన 'రంగస్థలం' సినిమా క్లాసిక్ బ్లాక్‌బస్టర్ గా నిలిచింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ ఎస్.శంకర్ కాంబినేషన్ లో "గేమ్ ఛేంజర్" అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా డిసెంబరు 21న అమెరికాలోని డల్లాస్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ఈవెంట్ చీఫ్ గెస్ట్ ను కూడా ప్రకటించారు.
యూఎస్ఏలో గ్రాండ్ గా జరగబోతున్న 'గేమ్ ఛేంజర్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు మాస్టర్ ఫిల్మ్ మేకర్ సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ నెల 21న సాయత్రం 6 గంటల నుంచి కర్టిస్ కల్వెల్ సెంటర్ లోని 4999 నామన్ ఫారెస్ట్ గార్లాండ్ లో ఈ మెగా ఈవెంట్ జరగనుందని పోస్ట్ చేశారు. రామ్ చరణ్ - సుకుమార్ చాలా రోజుల తర్వాత ఒకే వేదిక మీద చూసే అవకాశం దొరుకుతుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన 'రంగస్థలం' సినిమా క్లాసిక్ బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ రష్టిక్ యాక్షన్ డ్రామా నటుడిగా చరణ్‌కు ప్రశంసలు తెచ్చిపెట్టింది. వీరిద్దరూ కలిసి త్వరలో 'RC 17' ప్రాజెక్ట్ కోసం రెండోసారి చేతులు కలపబోతున్నారు. ఇది ఇండియన్ సినిమాలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో ఒకటిగా మారింది. 'RC 16' మూవీ పూర్తయిన తరవాత ఈ క్రేజీ కాంబో పట్టాలెక్కనుంది.
యునైటెడ్ స్టేట్స్‌లో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ చేయబోతున్న మొదటి భారతీయ చిత్రంగా 'గేమ్ ఛేంజర్' నిలవబోతోంది. ఈ అవుట్‌డోర్ ఈవెంట్‌లో చాలా మంది అభిమానులతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొంటారు. ఇప్పుడు 'పుష్ప 2: ది రూల్' సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించిన డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ మెగా ఈవెంట్ కు అటెండ్ అవుతుండటం ప్రధాన ఆకర్షణగా మారుతోంది.
'గేమ్ ఛేంజర్' అనేది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్ డ్రామా. ఇందులో తండ్రీ కొడుకులుగా రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ రామ్ నందన్ గా, సమాజ హితం కోసం పోరాటాలు చేసే అప్పన్నగా చెర్రీ రెండు పాత్రల్లో అలరించబోతున్నారు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో.. ఎస్‌జె సూర్య, జయరామ్, సముద్రఖని, నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, సునీల్, వెన్నెల కిషోర్, అచ్యుత్ కుమార్, వీకే నరేష్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకి కథ అందించగా.. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. ఎస్.థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. తిరు, రత్నవేలు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. సమీర్ మహ్మద్, రూబెన్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ మూవీ ఆడియోను సరిగమ ద్వారా విడుదల చేయనున్నారు.
'గేమ్ ఛేంజర్' సినిమాని 2025 జనవరి 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. తమిళంలో ఎస్‌విసి అండ్ ఆదిత్య రామ్ మూవీస్ విడుదల చేస్తుండగా, హిందీలో ఎఎ ఫిల్మ్స్ విడుదల చేయనుంది. ఉత్తర అమెరికాలో శ్లోకా ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ మెగా మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.