రాజమౌళికి పోటీగా ఒకే ఒక్కడు!
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాలీవుడ్ నుంచి రాజమౌళి స్థానం ఎంతో ప్రత్యేకమైనది. `బాహుబలి`, `ఆర్ ఆర్ ఆర్` లాంటి సినిమాలతో పాన్ ఇండియా లో ఆ స్థానాన్ని దక్కించుకున్నారు.
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాలీవుడ్ నుంచి రాజమౌళి స్థానం ఎంతో ప్రత్యేకమైనది. `బాహుబలి`, `ఆర్ ఆర్ ఆర్` లాంటి సినిమాలతో పాన్ ఇండియా లో ఆ స్థానాన్ని దక్కించుకున్నారు. `ఆర్ ఆర్ ఆర్` చిత్రానికి గానూ ఆస్కార్ రావడం... జేమ్స్ కామెరాన్ లాంటి దిగ్గజాల ప్రశంసతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఫేమయ్యారు. పాన్ ఇండియా చిత్రాలకు శ్రీకారం చుట్టింది ఆయనే కాబట్టి! జక్కన్న భారతీయ పరిశ్రమకి ఎప్పుడూ ప్రత్యేకమే.
మరి టాలీవుడ్ నుంచి ఆయనకు పోటీ ఎవరు ఆయన రేంజ్ ని టచ్ చేసింది ఎవరు అంటే సుకుమార్ అనే చెప్పాలి. `పుష్ప` సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టిన సుకుమార్ `పుష్ప-2` తో ఎలాంటి సంచనాలు నమోదు చేసారో తెలిసిందే. `పుష్ప-2` అత్యంత వేగంగా 1500 కోట్ల వసూళ్లను దాటడంతో లెక్కలు మాష్టారు పేరిప్పుడు దేశమంతా మారిమ్రోగిపోతుంది. ముఖ్యంగా నార్త్ లో సుకుమార్ ఓ బ్రాండ్ అయ్యారు.
అక్కడ రాజమౌళినే మించి పోయారు అనడంలో అతిశయోక్తి లేదు. అంతకు ముందు `సాహో`తో సుజిత్ ఆ స్థానంలో ఉండేవాడు. `సాహో` చిత్రం తెలుగులో ఫెయిలైనా హిందీలో మంచి వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రశాంత్ నీల్, చందు మొండేటి, ప్రశాంత్ వర్మ, సందీప్ రెడ్డి వంగా లాంటి వారి పేర్లు వినిపించాయి. వీళ్లు పాన్ ఇండియాలో నార్త్ మార్కెట్ నుంచి భారీగా వసూళ్లు రాబట్టారు. కానీ వాళ్ల స్థానాన్ని కచ్చితంగా నిర్దేశించలేని పరిస్థితి.
అయితే `పుష్ప-2` విజయం తర్వాత రాజమౌళి తర్వాత దేశంలో నెంబర్ 2 స్థానం మాత్రం సుకుమార్ దే అన్నది మెజార్టీ వర్గం అభిప్రాయం. సౌత్ నుంచి రాజమౌళి తీసిన బాహుబలి రెండవ భాగం 1800 కోట్ల వసూళ్లను సాధిస్తే. సుకుమార్ `పుష్ప -2` ఇప్పటికే 1500 కోట్ల వసూళ్లను సాధించింది. మరో 300 కోట్లు సాధిస్తే `బాహుబలి -2`ని బీట్ చేస్తుంది. కానీ ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి గుర్తింపు ఎంతో ప్రత్యేకమైనది. ఆస్కార్ ఘనుడు. హాలీవుడ్ దిగ్గజాలతోనే ప్రశంసలు అందుకున్న ఏకైక ఇండియన్ లెజెండ్.