సుకుమార్ డాటర్ సినిమా రిలీజ్ ఫిక్సైంది
పర్యావరణ పరిరక్షణ ఇతివృత్తంతో సందే శాత్మకంగా తెరకెక్కించిన చిత్రమిది.
స్టార్ డైరెక్టర్ సుకుమార్- తబితా దంపతుల కుమార్తె నటించిన సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో 'గాంధీతాత చెట్టు' చిత్రాన్ని పద్మావతి మల్లాది తెరకెక్కించిన సంగతి తెలిసిందే. పర్యావరణ పరిరక్షణ ఇతివృత్తంతో సందే శాత్మకంగా తెరకెక్కించిన చిత్రమిది. దీంతో అంతర్జాతీయ స్థాయి అవార్డులను అందుకుంది. ఉత్తమ బాలనటిగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది.
దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ , ఇండియన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో, సుకృతి బెస్ట్ డెబ్యూటెంట్ చైల్డ్ ఆర్టిస్ట్ విభాగంలో అవార్డులను గెలుచుకుంది. అలాగే 11వ నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రం అవార్డు, న్యూఢిల్లీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జ్యూరీ ఉత్తమ చిత్రం , ఉత్తమ ప్రాంతీయ చిత్రం, జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జ్యూరీ ఉత్తమ చిత్రం , 8వ ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా అవార్డులు గెలుచుకుంది.
ఇంకా పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఆహ్వానాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా రిలీజ్ తేదీ ఫిక్సైంది. జనవరి 24న చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. శాంతి సందేశం, అహింసా మార్గం, పచ్చని చెట్టు యోక్క గొప్పతనాన్ని, మహిళా సాధికారత, పర్యావరణం సమతుల్యత వంటి అంశాల్ని కథలో హైలైట్ చేసినట్లు తెలుస్తోంది.
ఇలాంటి మంచి చిత్రాలు ప్రజల హృదయాల్లో నిలిచిపోవాలన్నారు. వాటిని ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తమ ప్రయత్నానాన్ని ప్రేక్షకులు ఆశీర్వదించాలని కోరారు. ఈ చిత్రంలో ఆనంద్ చక్రపాణి, రఘు రామ్, భాను ప్రకాష్, నేహాల్ ఆనంద్ కుంకుమ, రాగ్ మయూర్ కీలక పాత్రలు పోషించారు. సుకుమార్ రైటింగ్స్-మైత్రీ మూవీమేకర్స్- గోపీ టాకీస్ సంయుక్తంగా నిర్మించాయి.