శిష్యుడితో మైత్రీకి ఆ ప్రాబ్ల‌మ్ లేదా?

ఒకే స‌న్నివేశాన్ని ఆయ‌న ర‌క‌ర‌కాలుగా తీయ‌డంతోనే అద‌నంగా ఖ‌ర్చు అవుతుంది.

Update: 2025-02-13 23:30 GMT

సుకుమార్ తో సినిమా అంటే నిర్మాత‌కు త‌డిపి మోపుడ‌వుతుంద‌ని ఇటీవ‌ల మైత్రీమూవీ మేక‌ర్స్ మాట‌ల్ని బ‌ట్టి అర్ద‌మైంది. ఒకే స‌న్నివేశాన్ని ఆయ‌న ర‌క‌ర‌కాలుగా తీయ‌డంతోనే అద‌నంగా ఖ‌ర్చు అవుతుంది. ఈ విషయం మైత్రీ నిర్మాత‌ల‌కు బాగా తెలుసు. కానీ సుకుమార్ మాట‌కు క‌ట్టుబ‌డి ఎంత డ‌బ్బైనా మంచి నీళ్ల‌లా ఖ‌ర్చు పెట్టే నిర్మాత‌లు కావ‌డంతో? ఆ కాంబినేష‌న్ లో అద్భుతాలు సాధ్య‌మ‌వుతున్నాయి అన్న‌ది అంతే వాస్త‌వం.

'రంగ‌స్థ‌లం', 'పుష్ప' లాంటి గొప్ప చిత్రాలు వచ్చాయి? అంటే అలాంటి త్యాగం దాగి ఉంది కాబ‌ట్టే సాధ్యమైంది. అదే నిర్మాత ద‌ర్శ‌కుడికి కండీష‌న్లు పెడితే ఔట్ పుట్ ఎలా ఉంటుంది? అన‌డానికి ఎన్నో ప్లాప్ చిత్రాలున్నాయి. అందుకే పుష్ప సినిమాకి సంబంధించిన స‌క్సెస్ క్రెడిట్ అంతా నిర్మాత‌ల‌కే సుకుమార్ ఇచ్చేసారు. సుకుమార్ రేంజ్ లో బుచ్చిబాబు కూడా ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఫేమ‌స్ అవుతున్నాడు. ఉప్పెన‌తో లాంచ్ అయిన బుచ్చిబాబు ఏకంగా రెండ‌వ సినిమా గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తోనే అందుకున్నాడు.

ప్ర‌స్తుతం ఈ కాంబినేష‌న్ లో ఆర్సీ 16 సెట్స్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్- వృద్ది సినిమాస్-సుకుమార్ రైంటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యాన‌ర్లు ఎన్ని క‌లిసినా? అగ్ర భాగం మాత్రం మైత్రీదే. అందులో ఎలాంటి డౌట్ లేదు. మైత్రీ సంస్థ‌లో బుచ్చిబాకు ఇది రెండ‌వ సినిమా. తొలి సినిమా `ఉప్పెన` కూడా మైత్రీలోనే నిర్మాణం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

అయితే గురువు సుకుమార్ లాగే శిష్యుడు బుచ్చిబాబు కూడా ఒకే స‌న్నివేశాన్ని ర‌క‌ర‌కాల వెర్ష‌న్లు తెర‌కెక్కించి బ‌డ్జెట్ పెంచేస్తాడా? లేక ఒకే వెర్ష‌న్ తెర‌కెక్కించి సింగిల్ టేక్ లో లాక్ చేస్తున్నాడా? అన్న సందేహాలు తెర‌పైకి వ‌స్తు న్నాయి. ఎందుకంటే సుకుమార్ ప్ర‌భావం బుచ్చిబాబు పై చాలా ఉంది. సుకుమార్ మెచ్చిన ప్రియ శిష్యుడు బుచ్చి. తాను గొప్ప ద‌ర్శ‌కుడు అవుతున్నాడు? అంటే అందుకు కార‌ణం సుకుమార్ . అత‌డి కార‌ణంగా బుచ్చిబాబు రెండ‌వ సినిమా చ‌ర‌ణ్ తో అందుకున్నాడు. ప్ర‌తిభావంతుడు కావ‌డంతోనే చ‌ర‌ణ్ కి రిఫ‌ర్ చెసాడు.

Tags:    

Similar News