బాహుబలి రికార్డుకు అడుగుదూరంలో పుష్ప 2
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీ కలెక్షన్స్ ప్రభంజనం ఇంకా కొనసాగుతోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీ కలెక్షన్స్ ప్రభంజనం ఇంకా కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన అన్ని చోట్ల ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. ప్రేక్షకుల జోరు కలెక్షన్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది. 17 రోజుల్లో ఈ చిత్రం 1500 కోట్ల మార్క్ ని దాటేసింది. ఇదే జోరు మూడో వారంలో కూడా కొనసాగితే 1600 కోట్ల మార్క్ ని కూడా ఈ సినిమా క్రాస్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా హిందీలో 652.9 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూళ్లు చేసింది. ఇక తెలుగులో కూడా 302.35 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. 17వ రోజైన శనివారం ఈ సినిమా ఏకంగా 25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది. దీంతో 1500 కోట్ల మైలురాయిని దాటేసింది. దేశ వ్యాప్తంగా చూసుకుంటే ‘పుష్ప 2’ కలెక్షన్స్ 1029.9 కోట్లు ఉన్నాయి. ఆదివారం కూడా ఈ మూవీ సాలిడ్ కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
అదే జరిగితే ‘పుష్ప 2’ మూవీ ‘బాహుబలి 2’ ఇండియన్ టోటల్ కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందని అనుకుంటున్నారు. ‘బాహుబలి 2’ మూవీ దేశవ్యాప్తంగా లాంగ్ రన్ లో 1040 కోట్లు వసూళ్లు చేసింది. అంటే ‘పుష్ప 2’ ఈ సినిమా కంటే 10 కోట్ల దూరంలోనే ఉంది. ఆదివారం ఈ సినిమాకి 40-50 కోట్ల మధ్యలో కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు. అంటే మరొక్క రోజులో ‘బాహుబలి 2’ ఇండియన్ కలెక్షన్స్ రికార్డ్ ని ‘పుష్ప 2’ బ్రేక్ చేయబోతోందని అనిపిస్తోంది.
నెక్స్ట్ తెలుగులో సెకండ్ హైయెస్ట్ షేర్ ‘బాహుబలి 2’ పేరు మీద ఉంది. ఈ కలెక్షన్స్ కూడా ‘పుష్ప 2’ క్రాస్ చేస్తుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో సెకండ్ హైయెస్ట్ షేర్ అందుకున్న చిత్రంగా ‘పుష్ప 2’ నిలవడానికి మరో 3 కోట్ల దూరంలోనే ఉందని తెలుస్తోంది. మూడో వారంలో ఈ నెంబర్ ఈజీగా క్రాస్ చేస్తుందని అనుకుంటున్నారు. ఇలా వరుసగా రికార్డులు క్రాస్ చేసుకుంటూ వెళ్తోన్న ఈ మూవీ లాంగ్ రన్ లో ఎంత వసూళ్లు చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.