సుకుమార్ చేతుల్లోనే చరణ్ రెండు సినిమాలు..!

సో ఆ లెక్కన RC 16, 17 రెండు సినిమాలు కూడా సుకుమార్ చేస్తున్నట్టే లెక్క. సుకుమార్ తో రాం చరణ్ రంగస్థలం సినిమా చేశాడు.

Update: 2024-12-31 04:09 GMT

గేమ్ ఛేంజర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న సినిమా బుచ్చి బాబు డైరెక్షన్ లో వస్తుంది. ఆర్సీ 16 సినిమా బుచ్చి బాబు సన ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా ఒక షెడ్యూల్ పూర్తి కాగా నెక్స్ట్ షెడ్యూల్ కి రెడీ అవుతున్నారు. ఐతే ఈ సినిమా తర్వాత చరణ్ సుకుమార్ డైరెక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. పుష్ప తర్వాత సుక్కు చేస్తున్న ఈ మూవీపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.

ఐతే బుచ్చి బాబు చరణ్ సినిమాకు కూడా సుకుమార్ సపోర్ట్ ఉండనుంది. సుకుమార్ అసిస్టెంట్ అయిన బుచ్చి బాబు మొదటి సినిమా ఉప్పెన కూడా సుకుమార్ ఆధ్వర్యంలోనే తెరకెక్కించాడు. ఇక ఇప్పుడు చరణ్ తో చేస్తున్న సినిమాకు బ్యాక్ సపోర్ట్ కూడా సుకుమార్ ఉంటాడని తెలుస్తుంది. చరణ్ లాంటి స్టార్ హీరో సినిమాకు ఒక సినిమా అనుభవం ఉన్న బుచ్చి బాబు ఎలా హ్యాండిల్ చేస్తాడు అన్నది చెప్పడం కష్టం. అందుకే బుచ్చి బాబు సినిమాకు సుకుమార్ పనిచేస్తాడు.

సో ఆ లెక్కన RC 16, 17 రెండు సినిమాలు కూడా సుకుమార్ చేస్తున్నట్టే లెక్క. సుకుమార్ తో రాంచరణ్ రంగస్థలం సినిమా చేశాడు. చరణ్ ని అప్పటివరకు అందరు ఒకలా చూపిస్తే సుకుమార్ మరోలా చూపించాడు. రంగస్థలం నుంచే రామ్ చరణ్ గ్రాఫ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లింది. RRR లో అతని కమిట్మెంట్ ఏంటన్నది తెలిసింది. సో చరణ్ ని ఎంత సానబడితే అంత పదునైన కత్తిలా మారతాడని అర్థమైంది.

RC 16, 17 రెండు సినిమాలు సుకుమార్ లాంటి డైరెక్టర్ సమక్షంలో రావడం మెగా ఫ్యాన్స్ ని కూడా ఖుషి చేస్తుంది. ఏది ఏమైనా చరణ్ రాబోతున్న సినిమాలు ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్ అందించేలా ఉంటాయని చెప్పొచ్చు. బుచ్చి బాబు డైరెక్షన్ లో సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తుందని తెలుస్తుండగా సుకుమార్ చరణ్ కాంబో మూవీ కూడా వేరే లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది. ఈ రెండు సినిమాలతో రామ్ చరణ్ మెగా ఫ్యాన్స్ కి నెవర్ బిఫోర్ మాస్ ట్రీట్ అందించాలని చూస్తున్నాడు. మరి ఈ సినిమాల లెక్క ఎలా ఉంటుంది అన్నది వచ్చాక కానీ తెలుస్తుంది.

Tags:    

Similar News