సుకుమార్.. 10 ఏళ్లు 3 సినిమాలు..?

పుష్ప 2 తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న సుకుమార్ తన నెక్స్ట్ సినిమాను గ్లోబల్ స్టార్ రాం చరణ్ తో చేస్తున్నాడు.

Update: 2025-01-19 02:45 GMT

పుష్ప 2 తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న సుకుమార్ తన నెక్స్ట్ సినిమాను గ్లోబల్ స్టార్ రాం చరణ్ తో చేస్తున్నాడు. RC 17గా రాబోతున్న ఈ సినిమా ప్లానింగ్ విషయంలో సుకుమార్ ఫోకస్ తో ఉన్నాడు. ప్రస్తుతం చరణ్ బుచ్చి బాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అవ్వకముందే సుకుమార్ సినిమా మొదలు పెడతారని తెలుస్తుంది. ఐతే సుకుమార్ రామ్ చరణ్ కలిసి రంగస్థలం లాంటి సినిమా చేశారు. మళ్లీ ఈ కాంబో కలిసి ఎలాంటి సినిమా చేస్తారన్నది ఆసక్తికరంగా ఉంది.

ఇదిలా ఉంటే సుకుమార్ చరణ్ సినిమా కోసం ఎలా లేదన్నా సరే 3 ఏళ్లు టైం తీసుకుంటాడు. ఇక నెక్స్ట్ సినిమా హీరో ఎవరన్నది తెలియదు కానీ ఆ సినిమా కోసం కూడా 2, 3 ఏళ్లు కచ్చితంగా టైం కేటాయిస్తాడు. సుకుమార్ ఇదివరకు రెండేళ్లకు ఒక సినిమా తీసేవాడు. ఇప్పుడు రెండు కాస్త 3 ఏళ్లు అయ్యింది. సో ఈ లెక్కన సుకుమార్ రాబోయే 10 ఏళ్లలో కేవలం 3 సినిమాలు మాత్రమే చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

సుకుమార్ హీరోల లిస్ట్ లో రాం చరణ్ తర్వాత విజయ్ దేవరకొండ, మహేష్ కూడా ఉన్నారు. అంతేకాదు సుకుమార్ పుష్ప 2 చివర్లో పుష్ప 3 కూడా ఉందని షాక్ ఇచ్చాడు. సో పుష్ప 3 కి కూడా ఎలా లేదన్నా మరో 2 ఏళ్లు కేటాయించాలి. సో ఇలా రాబోతున్న దశాబ్ద కాలంలో సుకుమార్ నుంచి కేవలం 3 లేదా మరీ స్పీడ్ గా చేయాలని చేస్తే 4 సినిమాలు మాత్రమే చూసే అవకాశం ఉంది.

సుకుమార్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ సినిమాను ఎక్కువ రోజులు తీసినా పక్కా హిట్ టార్గెట్ తో వస్తుంది కాబట్టి ఫ్యాన్స్ కి ఫీస్ట్ అందించే ఛాన్స్ ఉంటుంది. సుకుమార్ ప్లానింగ్ అదిరిపోగా చరణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, మహేష్ ఇలా వీళ్లలో ఎవరికి ఎలాంటి సినిమా ఇస్తాడన్నది చూడాలి. వీటితో పాటుగా సుకుమార్ మెగాస్టార్ చిరంజీవితో కూడా సినిమా చేయాలని చూస్తున్నాడు. అది ఎప్పుడు కుదురుతుంది అన్నది చెప్పడం కష్టమే. సుక్కు మార్క్ సినిమాలు కాస్త లేట్ అయినా పర్లేదు కానీ రచ్చ చేయడం కన్ఫర్మ్ అని చెప్పొచ్చు.

Tags:    

Similar News