అల్లు అర్జున్ ను కలిసిన సినీ ప్రముఖులు.. సుకుమార్, సురేఖ ఎమోషనల్!
ఈ సందర్భంగా... అల్లు అర్జున్ నివాసానికి పలువురు సినీ ప్రముఖులు చేరుకుని పరామర్శించారు. ఈ క్రమంలో.. దర్శకుడు సుకుమార్ ఎమోషనల్ అయ్యారు.
సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనకు సంబంధించిన కేసులో అరెస్టైన అల్లు అర్జున్ ఒకరాత్రి జైలులో ఉన్నారు. అనంతరం శనివారం ఉదయం నివాసానికి చేరుకున్నారు! ఈ సందర్భంగా... అల్లు అర్జున్ నివాసానికి పలువురు సినీ ప్రముఖులు చేరుకుని పరామర్శించారు. ఈ క్రమంలో.. దర్శకుడు సుకుమార్ ఎమోషనల్ అయ్యారు.
అవును... చంచల్ గూడ జైలు నుంచి విడుదలై ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ ని కే. రాఘవేంద్ర రావు, కొరటాల శివ, వంశీ పైడిపల్లి మొదలైన దర్శకులు కలిశారు. ఇదే సమయంలో.. నిర్మాతలు దిల్ రాజు, నవీన్, రవి తో పాటు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ తదితరులు కలిశారు. ఈ సందర్భంగా బన్నీతో కాసేపు చర్చించారు.
ఇక అల్లు అర్జున్ ను కలిసిన పుష్ప-2 దర్శకుడు సుకుమార్ భావోద్వేగానికి గురయ్యారు. తన హీరోని చూడగానే కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం ఆయన్ని అల్లు అర్జున్ ఆప్యాయంగా హత్తుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం చాలా మంది సినీ ప్రముఖులు అల్లు అర్జున్ నివాసానికి చేరుకుంటున్నారు.
మేనత్త సురేఖ భావోద్వేగం!:
తన మేనల్లుడు, నటుడు అల్లు అర్జున్ ను చిరంజీవి సతీమణి సురేఖ కలిశారు. ఇందులో భాగంగా... శనివారం ఉదయం అల్లు అర్జున్ నివాసానికి వెళ్లిన ఆమె బన్నీని చూడగానే భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ని హత్తుకుని సురేఖ ఎమోషన్ అవ్వగా.. మేనల్లుడు ధైర్యం చెప్పాడు!
కాగా.. అల్లు అర్జున్ అరెస్ట్ విషయం తెలిసిన వెంటనే చిరంజీవి దంపతులు శుక్రవారం మధ్యాహ్నం అల్లు అర్జున్ నివాసానికి చేర్కున్న సంగతి తెలిసిందే.